ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. ఈ వ్యక్తి టాలెంట్ మామూలుగా లేదుగా.. వీర లెవల్‌లో ఇంగ్లీషులో దంచేస్తున్నాడు..!

ABN, First Publish Date - 2023-04-21T15:33:38+05:30

ఒకప్పుడు వినోదం కావాలంటే.. టీవీలు చూడడం, లేదా సినిమాలకు వెళ్లేవాళ్లు. కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. కళ్ల ముందుకు వచ్చేస్తోంది. చదువు రాని వారు కూడా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు వినోదం కావాలంటే.. టీవీలు చూడడం, లేదా సినిమాలకు వెళ్లేవాళ్లు. కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. కళ్ల ముందుకు వచ్చేస్తోంది. చదువు రాని వారు కూడా స్మార్ట్ ఫోన్ సాయంతో సర్వం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి దృష్టిలో పడుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. వీటిలో కొన్ని వీడియోలు నవ్వు తెప్పించేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడే విధానం చూసి కొందరు నవ్వుకుంటుండగా.. మరికొందరు ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి వీడియో తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. ఓ వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ.. హిందీని కూడా మిక్స్ చేసి మాట్లాడటం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఓ వ్యక్తి కొండల మధ్య ఉన్న నీటి పక్కన నిలబడి తన సందేశాన్ని ఇంగ్లీష్, హిందీలో (English, Hindi) మిక్స్ చేసి చెప్పాడు. ‘‘ జీవితం చాలా చిన్నది.. అందుకే మీ ఇళ్ల నుంచి బయటికి వచ్చి ప్రపంచంలోని అందాలను చూసి ఆనందించండి’’.. అంటూ తన సందేశాన్ని వచ్చీరాని ఇంగ్లీష్‌లోనే చెబుతూ (Speaking in English) మధ్య మధ్యలో తన మాతృభాష అయిన హిందీని కూడా కలిపేస్తాడు.

Marriage: పెళ్లి వేడుకలో సడన్‌గా పవర్ కట్.. చిమ్మచీకట్లో బంధువుల హాహాకారాలు.. కరెంట్ వచ్చాక చూస్తే వధూవరులపై యాసిడ్ దాడి..!

ఈ క్రమంలో మధ్య మధ్యలో కొన్నిసార్లు ఇంగ్లీష్ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడతాడు. అయినా ఎలాగోలా చివరకు తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది గూగుల్ అనువాదంలా ఉంది’’.. అని కొందరు, ‘‘ఈరోజు ఇంగ్లీష్ చచ్చిపోయింది’’.. అని మరికొందరు, ‘‘ఇంగ్లీష్ రాకున్నా.. మాట్లాడేందుకు మీరు చేసిన ప్రయత్నం సూపర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఓ యువతి ఏడుపులు.. హోటల్‌లో పనిచేసే యువకుడికి డౌట్.. వెళ్లి అడిగితే ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-04-21T15:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising