Viral Video: నడి రోడ్డుపై యువతిని వెంటపడిన వ్యక్తి.. పదే పదే బలవంతం చేస్తుండగా.. చివర్లో సడన్‌గా ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-04-09T19:19:08+05:30
మహిళలపై ఎప్పుడు ఎటువైపు నుంచి దాడులు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా.. స్నేహితుల రూపంలోనో.. బంధువుల రూపంలోనే.. లేక బాటసారుల రూపంలోనో లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల..
మహిళలపై ఎప్పుడు ఎటువైపు నుంచి దాడులు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా.. స్నేహితుల రూపంలోనో.. బంధువుల రూపంలోనే.. లేక బాటసారుల రూపంలోనో లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువైపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. నడి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న యువతిని ఓ వ్యక్తి గమనించాడు. ఆమె వెనుకే వెళ్లి బలవంతం చేయసాగాడు. పదే పదే ఆమెను ఇబ్బంది పెడుతుండగా.. చివర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ యువతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఓ యువతి (young woman) నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఓ వ్యక్తి ఆమెను చాలా సేపటి నుంచి ఫాలో అవుతూ వస్తుంటాడు. మనుషులు ఎవరూ లేని సమయం చూసుకుని ఆమె వద్దకు వెళ్లి అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. ఊహించని ఈ ఘటనతో ఆమె ఉలిక్కిపడుతుంది. ‘‘వద్దు నన్ను వదిలెయ్ ప్లీజ్’’.. అని వేడుకుంటుంది. అయినా అతడు మాత్రం ఆమెను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు.
అదే సమయంలో ఓ వ్యక్తి అటుగా వస్తాడు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. అయితే అప్పటికే అటుగా ఓ బస్సు వెళ్తూ ఉంటుంది. యువతిని ఇబ్బంది పెట్టడాన్ని ప్రయాణికులు (Passengers) బస్సును నిలిపేస్తారు. వెంటనే కిందకు వచ్చి అతన్ని పట్టుకుని చితకబాదేస్తారు. యువతిని రక్షించి, క్షేమంగా వదిలిపెడతారు. యువతిపై దాడికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మనకెందుకులే అని అనుకోకుండా.. బస్సును ఆపి మరీ యువతిని రక్షించిన ప్రయాణికులను అంతా అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-04-09T19:39:37+05:30 IST