ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మొబైల్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడి వాలకం చూసి పగలబడి నవ్వుకుంటున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2023-03-14T20:21:38+05:30

ప్రస్తుతం మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనంత పరిస్థితి ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. కొందరు సెల్ఫీలు తీసుకోవడంలో తలమునకలైతే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాల పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనంత పరిస్థితి ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా స్మార్ట్ ఫోన్‌కు (Smart phone) ఎడిక్ట్ అవుతున్నారు. కొందరు సెల్ఫీలు తీసుకోవడంలో తలమునకలైతే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాల పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రపంచంతో సంబంధం లేకుండా నిత్యం ఫోన్‌తోనే కాలం వెళ్లదీస్తుంటారు. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఆఖరికి ప్రయాణంలో ఉన్నా సరే.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూస్తే కొన్నిసార్లు నవ్వు ఆపుకోలేని విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొబైల్ ధ్యాసలో పడిన ఓ వ్యక్తిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో (Viral Videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటాడు. పక్కన ఎవరు ఉన్నారు.. అనే విషయం కూడా మర్చిపోయి ఫోన్‌లో లీనమై ఉంటాడు. తల కిందకు దించి, ఫోన్ చూసుకుంటూ వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో తన ముందు ఏముంది అన్న విషయం కూడా తను మర్చిపోతాడు. అలా వేగంగా నడుచుకుంటూ వెళ్తుండగా.. ఎదరుగా ఓ నీళ్ల పౌంటైన్ (water Fountain) ఉంటుంది. కానీ సదరు వ్యక్తి మాత్రం ఇవేవీ పట్టించుకోడు. అలా ఫోన్ చూసుకుంటూనే వెళ్తుంటాడు.

పరిపక్వత లేదంటూ బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న యువతి.. చివరకు ఆమె చేసుకున్న వ్యక్తిని చూసి అంతా షాక్..

నేరుగా నీళ్ల పౌంటైన్ వద్దకు వెళ్లి.. కాలికి గోడ తగులుకుని ఎగిరి నీళ్లలో పడతాడు. దీంతో తన చేతిలోని బ్యాగు ఎగిరి పక్కన పడుతుంది. నీళ్లలో పడ్డాక గానీ అతడికి తత్వం బోధపడదు. అబ్బా! ఇలా జరిగిందేంటీ.. అనుకుంటూ వెంటనే పైకి లేస్తాడు. అతడిని గమనించిన ఓ మహిళ.. అక్కడికి వెళ్లి అతను బయటికి వచ్చేందుకు సాయం చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు (Funny comments) పెడుతున్నారు.

Viral Video: ప్రియురాలిని పార్క్‌కు పిలిచి.. వద్దు వద్దు అంటున్నా.. నుదుటిన బొట్టు పెట్టి మరీ.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-03-14T20:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising