Viral Video: కోటి మందికి పైగా చూసిన వీడియో.. లక్షల కొద్దీ లైకులు.. ఇంతకీ ఈ బురద నీళ్లల్లో ఇతడేం చేస్తున్నాడంటే..
ABN, First Publish Date - 2023-03-07T19:09:56+05:30
కాస్త విభిన్నంగా ఉంటే చాలు ఎలాంటి వీడియో అయినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. సాధారణం కంటే భిన్నంగా ఉండే విన్యాసాలు, వింతలు తదితరాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకోవడం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఎలాంటి అద్భుతాలు లేకున్నా..
కాస్త విభిన్నంగా ఉంటే చాలు ఎలాంటి వీడియో అయినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. సాధారణం కంటే భిన్నంగా ఉండే విన్యాసాలు, వింతలు తదితరాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకోవడం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఎలాంటి అద్భుతాలు లేకున్నా.. వీడియోలు మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటిదాకా కోటి మందికి పైగా చూశారు. అలాగే లక్షల కొద్దీ లైకులు వచ్చాయి. అలాగని ఈ వీడియోలోని వ్యక్తి ఎలాంటి మాయ, మంత్రం చేయలేదు. బురద నీళ్లలో ఇతడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం చేశాడంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. వర్షానికి ఓ మట్టి రోడ్డుపై వరద నీరు (flood water) భారీగా నిలిచి ఉంటుంది. నీటిని తొలగించేందుకు ఓ వ్యక్తి ముందుకు వస్తాడు. అయితే అంత నీటిని తొలగించడం ఆ ఒక్క వ్యక్తి వల్ల ఎలా సాధ్యం అవుతుంది.. అని అందరికీ అనిపిస్తుంది. సింపుల్‌గా ఓ పొడవాటి కర్ర పట్టుకుని అక్కడికి వస్తాడు. రోడ్డు మధ్యలో కర్రతో నీళ్లలో అటూ ఇటూ తిప్పుతూ ఉంటాడు. ఇతనేంటి ఇలా చేస్తున్నాడు.. అలా చేస్తే నీళ్లెలా పోతాయ్.. అని అనిపిస్తుంది. నీటిలో ఏదో వెతుకుతున్నట్లు కర్రతో చాలా సేపు తిప్పుతూనే ఉంటాడు. అప్పటికీ ఎవరికీ అర్థం కాదు. అయితే కాసేపటికి నీళ్లన్నీ భూమిలోకి వెళ్లడం ప్రారంభిస్తాయి.
అరే! ఇతనేదో మ్యాజిక్ చేశాడే అని అనిపిస్తుంది. చూస్తుండగానే నీళ్లు మొత్తం భూమిలోకి వెళ్తాయి. చివరగా గమనిస్తే.. అక్కడ మ్యాన్‌హోల్ (Manhole) ఉంటుంది. దానిపై ఉన్న ఇనుప గ్రిల్ చెత్తాచెదారంతో (Garbage) నిండిపోవడం వల్ల.. వరద నీరు మొత్తం నిలిచిపోయింది. ఇంతసేపు అతను మ్యాన్‌హోల్ గ్రిల్‌ను గుర్తించేందుకే అలా చేశాడని.. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ వీడియోను ప్రస్తుతం కోటి మందికి (crore views) పైగా వీక్షించారు. అలాగే లక్షల కొద్దీ లైకులు వచ్చిపడుతున్నాయి. నాకెందుకులే అని అనుకోకుండా.. చెత్తాచెదారాన్ని తొలగించి వరద నీరు వెళ్లేలా చేసిన ఇతడి సమాజ సేవ చూసి.. అంతా తెగ మెచ్చుకుంటున్నారు.
Updated Date - 2023-03-07T19:09:56+05:30 IST