ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఆకాశంలో పారాచూట్ చిక్కుపడడంతో.. భూమి పైకి దూసుకొచ్చిన వ్యక్తి.. ఇక మరణం ఖాయం అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా..

ABN, First Publish Date - 2023-08-24T12:46:07+05:30

కొందరు వారు ఎంచుకున్న రంగంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా అదిగమిస్తూ ముందుకు వెళ్తుంటారు. కొందరైతే ప్రమాదాలు జరిగినా మళ్లీ తట్టుకుని నిలబడి.. వారు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం...

కొందరు వారు ఎంచుకున్న రంగంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా అదిగమిస్తూ ముందుకు వెళ్తుంటారు. కొందరైతే ప్రమాదాలు జరిగినా మళ్లీ తట్టుకుని నిలబడి.. వారు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం స్కైడైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆకాశంలో డైవింగ్ చేస్తుండగా.. ఉన్నట్టుండి పారాచూట్ దారాలు ఒకదానిలో ఒకటి పడి చిక్కుకుపోయాయి. దీంతో ఒక్కసారిగా అతను నియంత్రణ కోల్పోయి భూమి వైపు వేగంగా దూసుకొచ్చాడు. అయితే తీరా నేలని తాకే సమయంలో ఊహించన ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో స్కైడైవింగ్ సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విమానంలో ఆకాశంలోకి వెళ్లి.. అక్కడి నుంచి స్కైడైవింగ్ (Skydiving) చేస్తాడు. మరోవైపు చేతిలోని కెమెరాను ఆన్ చేసుకుని, ఆకాశంలో అందాలను వీక్షిస్తూ విహరిస్తుంటాడు. అయితే ఇలాంటి సంతోషకర సమయంలో షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంటుంది. అప్పటిదాకా సవ్యంగా ఉన్న పారాచ్యూట్.. గాలి దాటికి ఒక్కసారిగా దాని దారాలన్నీ మెలితిరిగిపోయాయి. పారాచ్యూట్ పూర్తిగా ముడుచుకుపోవడంతో అతను ఒక్కసారిగా అదుపుతప్పి వేగంగా కిందకు దూసుకొస్తాడు.

Woman Constable: లింగమార్పిడి చేయించుకోవాలనుకున్న మహిళా కానిస్టేబుల్‌కు వింత కష్టం.. న్యాయం కోసం హైకోర్టుకెళ్తే..!

కనుచూపు మేరలో నేల ఉందనగా.. అప్పటికీ పారాచ్యూట్ తెరుచుకోదు. ఇక దాదాపు ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో మిరాకిల్ జరుగుతుంది. మరో పారాచ్యూట్ ఓపెన్ చేసుకోవడంతో ఎట్టకేలకు క్షేమంగా నేలపై ల్యాండ్ అవుతాడు. కాస్త కుదుపులకు లోనై స్వల్వ గాయాలతో బయటపడిపోతాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డు అవుతుంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! అలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ఇతను ప్రవర్తించిన తీరు అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఖరీదైన బైకులో పారిపోయిన దొంగలను.. స్కూటీపై వెంబడించిన పోలీసులు.. నాలుగే నాలుగు నిముషాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-08-24T12:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising