ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ పిల్లికి మరీ ఇంత అసూయ ఎందుకో.. యజమాని పట్టించుకోలేదని చివరకు ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-07-19T18:12:26+05:30

కుక్కలు, పిల్లలు మనిషితో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంటాయి. ఇంట్లో వారితో కలిసిపోతూ అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. యజమానుల ప్రాణాలను కాపాడే క్రమంలో విష సర్పాలు, పులులు, సింహాలతో పోరాడిన కుక్కలను చాలా చూశాం. అలాగే యజమాని పిల్లలతో..

కుక్కలు, పిల్లలు మనిషితో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంటాయి. ఇంట్లో వారితో కలిసిపోతూ అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. యజమానుల ప్రాణాలను కాపాడే క్రమంలో విష సర్పాలు, పులులు, సింహాలతో పోరాడిన కుక్కలను చాలా చూశాం. అలాగే యజమాని పిల్లలతో ఓ వైపు ఆడుకుంటూనే మరోవైపు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పిల్లి వీడియో చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పిల్లికి మరీ ఇంత అసూయ ఎందుకో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన పెంపుడు పిల్లి (pet cat) సహనానికి పరీక్ష పెట్టాలని అనుకుంటాడు. ఇందుకోసం తెలివిగా ఆలోచించి.. ఓ పిల్లి బొమ్మను (cat toy) తీసుకొస్తాడు. దాన్ని తన పెంపుడు పిల్లి పక్కనే నిలబెడతాడు. కాసేపటి తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోతూ.. పిల్లి బొమ్మ తలపై చేయి పెట్టి ప్రేమగా నిమిరిన తర్వాత ‘‘వెళ్లొస్తా... బాయ్’’.. అని చెప్పి పక్కన ఉన్న పెంపుడు పిల్లిని పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. మొదటి నుంచి తన యజమాని ప్రవర్తనను గమనించిన పిల్లి అలాగే చూస్తూ ఉండిపోతుంది. తనను పట్టించుకోకుండా యజమాని బయటికి వెళ్లిపోవడంతో చిర్రెత్తుకొస్తుంది.

Viral Video: ఆహారం దొరక్కపోతే ఇలాక్కూడా చేస్తాయా.. వామ్మో! ఈ ఎలిగేటర్ ఆవేశం చూస్తే షాకవ్వాల్సిందే..

పక్కన ఉన్న పిల్లి బొమ్మను చూసి ‘‘ఈ దొంగ పిల్లి వల్లే.. నా యజమాని నన్ను పట్టించుకోలేదు.. దీన్ని ఇంటి నుంచి గెంటేస్తే పీడ వదిలిపోతుంది’’.. అనుకుంటూ దానిపై దాడి చేస్తుంది. పిల్లి బొమ్మను (pet cat attacked on cat toy) కింద పడేసి మీదకు ఎక్కి రక్కుతుంది. ఈ ఘటనను మొత్తం అతను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పిల్లికి అసూయ ఎక్కువ ఉన్నట్లు ఉంది’’.. అని కొందరు, ‘‘వామ్మో! ఇదెక్కడి పిల్లిరా నాయనా’’.. అంటూ మరికొందరు, ‘‘ఆడవారికి కూడా ఇంత అసూయ ఉండదేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది.

India-Pakistan: ఈ మహిళ సంగతి సరే కానీ.. 8 ఏళ్ల క్రితం భారత్‌లోకి అక్రమంగా వచ్చిన పాకిస్తానీ మహిళను ఏం చేశారంటే..!

Updated Date - 2023-07-19T18:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising