Viral Video: కుక్క అరవడంతో తలుపు వైపు చూసిన వ్యక్తి.. ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపే ఊహించని షాక్.. చివరకు..
ABN, First Publish Date - 2023-07-23T16:06:44+05:30
పెంపుడు కుక్కలు తమ యజమానితో పాటూ కుటుంబ సభ్యుల సంరక్షణే ధ్యేయంగా బతుకుతుంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తమ యజమానులను కాపాడిన కుక్కలను ఎన్నో చూశాం. కొన్ని కుక్కలైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విష సర్పాలు, పులులు, సింహాలతో పోరాటానికి దిగుతుంటాయి. ఇలాంటి...
పెంపుడు కుక్కలు తమ యజమానితో పాటూ కుటుంబ సభ్యుల సంరక్షణే ధ్యేయంగా బతుకుతుంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తమ యజమానులను కాపాడిన కుక్కలను ఎన్నో చూశాం. కొన్ని కుక్కలైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విష సర్పాలు, పులులు, సింహాలతో పోరాటానికి దిగుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పెంపుడు కుక్క అరుస్తుండడంతో తలుపు వైపు చూసిన యజమానికి షాకింగ్ దృశ్యం కనిపించింది. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రాత్రి వేళ ఓ వ్యక్తి తలుపు తీసి ఉంచి ఏదో పనిలో బిజీగా ఉంటాడు. అంతలో తలుపు వద్ద శబ్ధం వినిపించడంతో అతడి పెంపుడు కుక్క (pet dog) అలెర్ట్ అవుతుంది. మొరుగుతూ తలుపు వద్దకు వెళ్లగా అప్పటికే ఓ పెద్ద ఎలుగు బంటి.. ఇంట్లోకి చొరబడుతూ ఉంటుంది. దీంతో కుక్క గట్టిగా మొరుగుతూ ఎలుగుబంటి (bear) ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కుక్క అరవడం విని ఇంటి యజమాని తలుపు వైపు చూస్తాడు. ఎలుగుబంటిని చూసి షాక్ అవుతాడు. పరుగెత్తుకుంటూ తలుపు వద్దకు వెళ్లి.. ముందుగా తన పెంపుడు కుక్కను పక్కకు లాగుతాడు.
తర్వాత ఎలుగు బంటిని బయటికి తరిమికొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఎలుగుబంటి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఎలాగోలా దాని బారి నుంచి తప్పించుకుని, పక్కనే ఉన్న సోఫాను లాగి డోరుకు అడ్డంగా పెడతాడు. దీంతో ఎలుగు బంటి కొద్ది సేపు అక్కడే ఉండి.. చివరకు ఇంట్లోకి రాలేక వెనక్కు వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘పెంపుడు కుక్క గమనించకుండా ఉండుంటే.. పెద్ద ప్రమాదమే జరిగేది’’.. అంటూ కొందరు, ఆ వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-07-23T16:06:44+05:30 IST