Viral Video: విమానం టేకాఫ్ అయేటప్పుడు వాటిని ఎందుకు ఓపెన్ చేయాలి..? ఈ పైలెట్ చెప్పిన మూడు కారణాలు వింటే..!
ABN, First Publish Date - 2023-03-03T18:15:06+05:30
కార్లు, బస్సులు, రైళ్లు.. ఇలా దేనిలో ప్రయాణించినా ఎక్కవమంది విండో సీట్‌నే ఇష్టపడుతుంటారు. వాహనం ముందుకు వెళుతుంటే.. బయటి దృశ్యాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. నేలపై నడిచే వాహనాల్లోనే ఇలాంటి అనుభూతి ఉంటే.. గాల్లో చక్కర్లు కొట్టే..
కార్లు, బస్సులు, రైళ్లు.. ఇలా దేనిలో ప్రయాణించినా ఎక్కవమంది విండో సీట్‌నే ఇష్టపడుతుంటారు. వాహనం ముందుకు వెళుతుంటే.. బయటి దృశ్యాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. నేలపై నడిచే వాహనాల్లోనే ఇలాంటి అనుభూతి ఉంటే.. గాల్లో చక్కర్లు కొట్టే విమానంలో ఇక ఆ దృశ్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఓ పైలెట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానం టేకాఫ్ సమయంలో విమాన కిటికీ షేడ్స్‌ను ఎందురు తెరచి ఉంచాలనే దానిపై ఈ పైలెట్ చెప్పిన మూడు కారణాలు ఏంటంటే..
స్పైస్ జెట్ విమాన (SpiceJet Airlines) పైలెట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమాన ప్రయాణ సమయాల్లో ఎవరైనా విండో సీట్ కావాలని అనుకుంటూ ఉంటారు. మోహిత్ టియోటియా అనే పైలట్ ఢిల్లీ-శ్రీనగర్ (Delhi-Srinagar) విమానంలో హిందీలో చేసిన సూచనలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. విమానం టేకాఫ్, ల్యాండింగ్ (Take off, landing) సమయంలో ప్రయాణికులు వారి విండో షేడ్స్ (Window shades) ఉంచడం వల్ల కలిగే మూడు ప్రయోజనాలను (Three benefits) అతను వివరించాడు. ఇందులో మొదటి కారణం.. కిటికీ షేడ్స్‌ను తెరవడం వల్ల బయటి దృశ్యాలను ఆస్వాదించే అవకాశం ఉంటుందన్నారు. ఇక రెండో కారణాన్ని వివరిస్తూ.. కిటికీ షేడ్స్‌ను తెరిచి ఉండడం వల్ల బయటి దృశ్యాలను ఆస్వాదించడంతో పాటూ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నాడు.
మూడో కారణాన్ని వివరిస్తూ.. ప్రయాణికులు బయటి దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసుకోవడం వల్ల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ (Instagram, Facebook) తదితర సోషల్ మీడియాలో ఖాతాల్లో అందమైన ఫొటోలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు. సదరు పైలెట్ సరదాగా చెప్పిన ఈ మూడు కారణాలను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి పైలెట్ ఉన్న విమానంలోనే ప్రయాణించాలి.. అని కొందరు, ఈ విమానంలో ఉన్న ప్రయాణికులు అదృష్టవంతులు అని ఇంకొందరు, మీరు చాలా అద్భుతమైన పైలెట్.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-03-03T18:15:06+05:30 IST