Viral video: హంసపై దాడి చేసిన పులి.. తీరా దగ్గరికి వెళ్లాక సీన్ రివర్స్.. చివరికి ఏమైందో చూడండి..
ABN, First Publish Date - 2023-07-09T15:52:08+05:30
పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులన్నీ దూరంగా పారిపోతుంటాయి. అయినా అవి వెంబడించి మరీ దాడి చేసి, తమ ఆకలి తీర్చుకుంటుంటాయి. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్లు.. కొన్నిసార్లు పరిస్థితి తారుమారు అవుతుంటుంది. చిన్న చిన్న జంతువులతో ..
పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులన్నీ దూరంగా పారిపోతుంటాయి. అయినా అవి వెంబడించి మరీ దాడి చేసి, తమ ఆకలి తీర్చుకుంటుంటాయి. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్లు.. కొన్నిసార్లు పరిస్థితి తారుమారు అవుతుంటుంది. చిన్న చిన్న జంతువులతో తలపడి చివరకు తోక ముడవాల్సి వస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పులికి ఓ హంస చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద గదిలో పులులతో (Tigers) పాటూ మరికొన్ని జంతువులు, పక్షులను ఉంచి సంరక్షిస్తుంటారు. ఇనుప బోనులో ఉన్న పులి పిల్లను కాసేపు బయట తిరిగేందుకు వదులుతారు. అదే సమయంలో ఓ హంస (swan) కూడా అక్కడే ఉంటుంది. అన్నీ ఒకే గదిలో ఉన్నా హంసను చూడగానే పులికి ఒక్కసారిగా తాను మాంసాహారిని అనే విషయం గుర్తుకొస్తుంది. అప్రయత్నంగానే హంసపై (Tiger attack on swan) దాడికి దిగుతుంది. దూరంగా ఉన్న హంస వద్దకు వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. తీరా పంజా విసిరే సమయంలో హంసకు అలెర్ట్ అవుతుంది.
Viral video: ఇది ఇంగ్లీష్ నేర్చిన కుక్క.. యజమాని పెట్టిన పరీక్షలో ఎలా నెగ్గిందో చూడండి..
‘‘అంతా ఒకే గదిలో స్నేహంగా ఉన్నామనే విషయం కూడా మర్చిపోయి.. నన్నే చంపాలని చూస్తావా’’.. అన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పులిపై ఎదురుదాడి చేస్తుంది. తన పొడవాటి ముక్కుతో పులిని గట్టిగా పట్టుకుంటుంది. దెబ్బకు పులి తోక ముడిచి అక్కడి నుంచి తన బోనులోకి పరుగులు పెడుతుంది. అయినా హంస మాత్రం దాన్ని వదలకుండా బోను లోపలికి వెళ్లే వరకూ తరిమికొడుతుంది. ‘‘అమ్మో!.. అనవసరంగా దీని జోలికి వెళ్లా’’.. అనుకుంటూ పులి లోపలికి వెళ్లి దాక్కుంటుంది. ఈ ఘటను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-09T15:52:08+05:30 IST