Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?
ABN, First Publish Date - 2023-07-12T20:31:03+05:30
వినూత్నంగా ఆలోచించాలే గానీ.. పనికిరావని పక్కన పడేసే వస్తువులు కూడా ఆశ్చర్యకరంగా అంతకంటే ఎక్కువగా పనికొస్తుంటాయి. కొందరు పాడయిన వస్తువులతోనే ఎవరూ ఊహించని విధంగా అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వినూత్న...
వినూత్నంగా ఆలోచించాలే గానీ.. పనికిరావని పక్కన పడేసే వస్తువులు కూడా ఆశ్చర్యకరంగా అంతకంటే ఎక్కువగా పనికొస్తుంటాయి. కొందరు పాడయిన వస్తువులతోనే ఎవరూ ఊహించని విధంగా అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తెలివితేటలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా’’..! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. పేస్ట్ అయిపోగానే సాధారణంగా ఎవరైనా డబ్బాను పక్కన పడేస్తారు. అలాంటి డబ్బా దేనికి పనికొస్తుందని అంతా అనుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం అలా కాదు. ఖాళీ పేస్ట్ ట్యూబ్ (empty paste tube) కూడా ఎంతో పనికొస్తుందని నిరూపించింది. కుళాయి మూత పాడవడంతో నీరు వృథా అవుతుంటుంది. దీన్ని చూసిన మహిళకు ఓ వినూత్న ఆలోచన వస్తుంది. పక్కన పడేసిన పేస్ట్ డబ్బా వెనుక వైపు కట్ చేసి.. కొళాయి పైపునకు (empty paste tube attached to broken tap) తొడుగుతుంది. బకెట్‌కు నీళ్లు పట్టుకున్న తర్వాత ఎంచక్కా.. పేస్ట్ డబ్బాకు మూత పెట్టేస్తుంది.
ఈ విధంగా ఆమె కుళాయి మూత కొనకుండానే.. నీటి వృథాను అరికట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మహిళ తెలివిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘వావ్! ఈమె తెలివికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో’’.. అని ఇంకొందరు, ‘‘ఖాళీ పేస్ట్ డబ్బాను.. ఇలాక్కూడా ఉపయోగించవచ్చని మాకు ఇంత వరకూ తెలీదే’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-07-12T20:31:03+05:30 IST