ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Driving Test: ఈ డ్రైవింగ్ టెస్ట్ చేసింది ఎవరో కానీ.. శతకోటి వందనాలు.. కారు చుట్టుపక్కల ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది.. లేకుంటే..!

ABN, First Publish Date - 2023-06-09T18:02:06+05:30

కొన్నిసార్లు కొందరు ఊహించని ప్రమాదాలకు గురైతే.. మరికొన్నిసార్లు కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు కొందరు ఊహించని ప్రమాదాలకు గురైతే.. మరికొన్నిసార్లు కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి అనూహ్య ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ కారు డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. డ్రైవింగ్ టెస్ట్ కోసం వెళ్లిన ఓ మహిళ.. అధికారులకు షాక్ ఇచ్చింది. కారు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది..

అర్జెంటీనాలో (Argentina) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 63ఏళ్ల ఓ మహిళ లైసెన్స్ తీసుకునేందుకు డ్రైవింగ్ టెస్ట్‌కు (Driving test) వెళ్లింది. ఆమె వంతు రాగానే అధికారులు మహిళ చేతికి ఓ కారు ఇచ్చారు. ముందుగా ఆమె కారును (woman driving a car) సక్రమంగా నడుపుతూ ఓ మలుపు కూడా తిప్పింది. అయితే మలుపు తిప్పి ముందుకు వెళ్లే సమయంలో బార్డర్ దాటి పక్కనే ఉన్న గడ్డిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లింది. అయినా మళ్లీ కారును ఎలాగోలా సరైన దిశలోకి తెచ్చింది. తర్వాత రెండో మలుపు తిప్పే సమయంలో మాత్రం మరింత తడబడింది. పక్కనే ఉన్న బార్డర్ లైన్ మీదకు ఎక్కించి.. ఒక్కసారిగా వేగాన్ని పెంచింది.

Viral Video: వారెవ్వా.. తెలివంటే నీదే కదా బ్రదర్.. పాత కారులో ఒక్క చిన్న మార్పు చేసి.. ట్రెండ్‌లోకి వచ్చేలా చేశాడుగా..!

దీంతో కారు అధిక వేగంతో దూసుకొచ్చి ఎదురుగా ఉన్న గడ్డి మీదకు వెళ్లి అక్కడే ఉన్న స్తంభాన్ని (car hit the pole) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా పల్టీ కొట్టింది. అయితే అక్కడే ఉన్న సిబ్బంది మహిళను బయటికి తీసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది డ్రైవింగ్ టెస్ట్ సమయంలో ప్రమాదాలు జరగడం ఇదేం కొత్తేమీ కాదు. యూకే పరిధిలో 2014-2019 మధ్య కాలంలో 3000 కంటే ఎక్కువ మంది ఇలా ప్రమాదాలకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం మహిళ డ్రైవింగ్ టెస్ట్‌కు సంబంధించిన వీడియో (Viral video) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Bride: కాసేపట్లో పెళ్లనగా భారీ షాకిచ్చిన వధువు.. అప్పటికప్పుడు వేరే యువతితో వరుడికి పెళ్లి.. ఎందుకిలా చేశావని ఆ వధువును నిలదీస్తే..!

Updated Date - 2023-06-09T18:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising