Funny viral video: ఎక్కడా స్థలం లేక డ్రైవర్ సీట్లో కూర్చున్న మహిళ.. దిగమని కోరగా చివరకు ఆమె ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-03-15T20:11:49+05:30

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు సీటు కోసం ఏకంగా యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరిగే ఘటనలు కూడా చాలా సార్లు చూశాం. కొందరు విధిలేని పరిస్థితుల్లో..

Funny viral video: ఎక్కడా స్థలం లేక డ్రైవర్ సీట్లో కూర్చున్న మహిళ.. దిగమని కోరగా చివరకు ఆమె ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో (Bus and train travel) కొన్నిసార్లు సీటు కోసం ఏకంగా యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరిగే ఘటనలు కూడా చాలా సార్లు చూశాం. కొందరు విధిలేని పరిస్థితుల్లో గంటల కొద్దీ నిలబడే ప్రయాణం చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి సమయాల్లో కొన్ని ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో (women Viral videos) తెగ వైరల్ అవుతోంది. బస్సులో ఎక్కడా స్థలం లేకపోడంతో ఓ మహిళ.. ఏకంగా డ్రైవర్ సీట్లో కూర్చుంది. కిందకు దిగమని కోరిన డ్రైవర్.. ఆమె ఇచ్చిన బంపర్ ఆఫర్ విని చివరకు అవాక్కయ్యాడు.

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన అత్తతో కలిసి బస్సు ఎక్కుతుంది. అయితే అప్పటికే ప్రయాణికులతో బస్సు (bus) ఫుల్‌గా ఉంటుంది. చివరకు ఎలాగోలా తన అత్తకు మాత్రం సీటు దొరుకుతుంది. తనకు ఎక్కడా స్థలం లేకపోవడంతో ఎలాగైనా సీటు సంపాదించాలని మొత్తం వెతుకుతుంది. చివరకు డ్రైవర్ సీటు ఖాళీగా ఉండడంతో ఇదేదో ప్రశాంతంగా ఉందే.. అనుకుని అందులో కూర్చుంటుంది. కాసేపటికి అక్కడి వచ్చిన డ్రైవర్.. తన సీట్లో మహిళ (woman) కూర్చోవడాన్ని చూసి షాక్ అవుతాడు. ‘‘ఇదేంటమ్మా! నా సీట్లో కూర్చున్నావ్.. ఇలాగైతే బస్సు ఎలా ముందుకు వెళ్తుంది. వెళ్లి ఇంకెక్కడైనా కూర్చో’’.. అని చెబుతాడు. అయితే ఇందుకు ఆమెకు అసలు ఒప్పుకోదు. ‘‘సీటులో నుంచి దిగే ప్రసక్తే లేదు. నాకు ఇక్కడే బాగుంది.. కావాలంటే నువ్వే ఇంకెక్కడైనా కూర్చుని నడుపుకో’’.. అంటూ అతడికి బంపర్ ఆఫర్ ఇస్తుంది.

డాక్టర్‌తో నర్సు ప్రేమాయణం.. పెళ్లి చేసుకునే ముందు విచారించగా.. అసలు విషయం తెలియడంతో ఖంగుతిన్న యువతి..

మహిళ మాటలకు సదరు డ్రైవర్ (Driver) ఒక్కసారిగా అవాక్కవుతాడు. చివరకు సహనం కోల్పోయి ఆమెను బలవంతంగా కిందకు దింపేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అత్తాకోడళ్లు కలిసిపోయి.. డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగుతారు. వీరి గొడవతో చుట్టు పక్కల ఉన్న వారంతా అక్కడ గుమికూడతారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. నవ్వుకోవడం కోసం ఇదంతా ప్లానింగ్ ప్రకారం చేశారు.. అని కొందరు, ఈ మహిళ మంచి సీటునే ఎంచుకుంది.. అని మరికొందరు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

Viral Video: అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశిస్తున్న కోతి.. అడుగడుగుకూ దండాలు పెడుతూ.. ఎలా వేడుకుంటుందో చూడండి..

Updated Date - 2023-03-15T20:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising