ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ ఎలుగుబంటికి సెల్ఫీల పిచ్చి పట్టినట్లుంది.. సింహాన్ని ఫొటో తీస్తున్న యువతిని.. ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-04-28T16:28:52+05:30

ప్రస్తుతం యువతీయువకులు సెల్ఫీలు, రీల్స్ మాయలో పడి కొన్నిసార్లు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. చాలా మంది యువతులు కూడా సెల్ఫీల మోజులో పడి ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఏనుగులు, పులులు, సింహాలు తదితర జంతువులతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం యువతీయువకులు సెల్ఫీలు, రీల్స్ మాయలో పడి కొన్నిసార్లు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. చాలా మంది యువతులు కూడా సెల్ఫీల మోజులో పడి ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఏనుగులు, పులులు, సింహాలు తదితర జంతువులతో ఫొటోలు, వీడియోలు తీసుకునే క్రమంలో చివరకు.. చావు తప్పి కన్ను లొట్టబోయిన సందర్భాలు చాలా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. సింహాన్ని ఫొటో తీస్తున్న యువతికి ఎలుగుబంటి షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ‘‘వామ్మో! ఈ ఎలుగుబంటికి సెల్ఫీల పిచ్చి ఎక్కువ ఉన్నట్టుందే’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Videos) అవుతోంది. ఓ యువతి జంతు ప్రదర్శన శాలలో (Zoo) క్రూర జంతువులను సందర్శించడానికి వెళ్తుంది. ఈ క్రమంలో ఎలుగుబంటి, సింహం (Bear, lion) ఉన్న బోను వద్దకు వెళ్తుంది. ఎలుగుబంటి ఉన్న బోను వెలుపలే కూర్చుని.. సింహాన్ని ఫొటో (Photo) తీస్తూ ఉంటుంది. దీంతో ఎలుగుబంటికి కోపం వచ్చినట్లుంది. ‘‘నాతో ఫొటో దిగకుండా.. సింహంతో దిగుతావా’’.. అని అన్నట్లుగా కాలితో యువతి షర్ట్ పట్టుకుని లాగుతుంది. ఊహించని ఈ ఘటనతో యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.

Viral Vdeo: ఇదేం పిచ్చిరా నాయనా.. మనిషిని ఎత్తుకుని డాన్స్ చేయడం చూశాం గానీ.. మరీ ఇలా ఏకంగా..

వెంటనే తేరుకుని ఎలుగుబంటి చేసిన పనికి తెగ నవ్వుకుంటుంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. ఎలుగుబంటి నుంచి ఆమెను విడిపించి పక్కకు తీసుకెళ్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు. ‘‘యువతి మాదిరే ఎలుగుబంటికి కూడా ఫొటోల పిచ్చి ఉన్నట్టుంది’’.. అని కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Crime news: పుట్టిన రోజు వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించిన యువతి.. గదిలో ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా మరో వ్యక్తి లోపలికి వచ్చి..

Updated Date - 2023-04-28T21:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising