Funny Video: ఏమీ చదవకుండానే ఐఏఎస్ అవడం ఎలా..?.. ఈ ప్రశ్నకు ఈ యువతి ఇచ్చిన సమాధానమేంటో వింటే..
ABN, First Publish Date - 2023-03-28T15:28:06+05:30
మీరు లైఫ్‌లో ఏమవ్వాలని అనుకుంటున్నారు..? అని విద్యార్థులను అడిగితే.. ఐఏఎస్, ఐపీఎస్.. ఇలా టకటకా సమాధానాలు చెబుతుంటారు. అయితే ఐఏఎస్ కావడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదనే విషయం.. పోను పోనూ అర్థమవుతుంది. కొందరు నిద్రాహారాలు మాని..
మీరు లైఫ్‌లో ఏమవ్వాలని అనుకుంటున్నారు..? అని విద్యార్థులను అడిగితే.. ఐఏఎస్, ఐపీఎస్.. ఇలా టకటకా సమాధానాలు చెబుతుంటారు. అయితే ఐఏఎస్ కావడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదనే విషయం.. పోను పోనూ అర్థమవుతుంది. కొందరు నిద్రాహారాలు మాని గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టినా.. అనుకున్న లక్ష్యానికి చేరుకోలేరు. మరికొందరు ఎలాగైనా తాము అనుకున్నది సాధించాలనే ఉద్దేశంతో పట్టు వదలకుండా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది తాము అనుకున్ లక్ష్యానికి చేరుకుంటుంటారు. ఈ విషయం పక్కన పెడితే .. చదవకుండానే ఐఏఎస్ అవడం ఎలా!.. ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమీ చదవకుండానే ఐఏఎస్ అవడం ఎలా..? ఏమీ చదవకుండానే ఐఏఎస్ అవడం ఎలా..? అన్న నెటిజన్ల ప్రశ్నకు ఓ యువతి ఇచ్చిన సమాధానం ఏంటంటే..
సోషల్ మీడియాలో ఓ యువతికి సంబంధించిన వీడియో (young woman girl viral videos) వైరల్ అవుతోంది. కొందరికి ఏవేవో కోరికలు ఉంటాయి కానీ.. వాటి సాధన కోసం ప్రయత్నాలు మాత్రం చేయరు. ఏదైనా ఈజీగా సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి చిత్రవిచిత్రమైన డౌట్లు వస్తుంటాయి. అలాగే విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. UPSC NOTES పేరుతో ఉన్న ట్విట్టర్ (Twitter) ఖాతాలో ఓ యువతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఆమెను చాలా మంది నెటిజన్లు UPSC కి సంబంధించి వివిధ రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. యువతి కూడా వారికి ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు. ‘‘ఏమీ చదవకుండానే ఐఏఎస్ (IAS) అవడం ఎలా’’..? అని అడగడంతో యువతి అవాక్కవుతుంది. అంతే వేగంగా అతడికి సమధానం ఇస్తుంది. ‘‘ఎందుకు అవ్వకూడదు.. కలలో ఏమైనా అవ్వొచ్చు’’.. అని చెప్పడంతో సదరు వ్యక్తి ఖంగుతింటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు.
Updated Date - 2023-03-28T15:28:06+05:30 IST