ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. ఇదేం బైక్‌రా నాయనా..? ట్రాక్టర్ టైరును తీసుకొచ్చి బండికి తగిలించారుగా..!

ABN, First Publish Date - 2023-08-10T15:23:41+05:30

క్రియేటివిటీగా ఆలోచించే చాలా మంది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తూ.. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరి క్రేజీ తెలివితేటలు చూస్తే మరీ..

క్రియేటివిటీగా ఆలోచించే చాలా మంది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తూ.. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరి క్రేజీ తెలివితేటలు చూస్తే మరీ విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బైకు ముందు భాగాన ట్రాక్టర్ టైరును అమర్చిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఇదేం బైక్‌రా నాయనా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులకు వినూత్న వాహనం (innovative vehicle) తయారు చేయాలనే విచిత్రమైన ఐడియా వచ్చింది. వెంటనే ఓ పాత బైకు తీసుకుని ముందు చక్రాన్ని తొలగించారు. తర్వాత దాని స్థానంలో ట్రాక్టర్ ఇంజిన్‌కు ఉండే పెద్ద టైరును (Fitting a tractor tire to bike) అమర్చారు. టైరును అటూ ఇటూ తిప్పుతూ కంట్రోల్ చేసేందుకు ఇనుప క్లాంప్‌ను కూడా అమర్చారు. అంతటితో ఆగకుండా టైరు పైభాగాన కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇలా పూర్తి స్థాయిలో వాహనాన్ని సిద్ధం చేశాక.. ఓ వ్యక్తి బైకుపై కూర్చుని నడుపుతుండగా, మరో వ్యక్తి ట్రాక్టర్ టైరుపై కూర్చున్నాడు.

Businessman: బ్యాంకు నుంచి ఫోన్‌.. వాళ్లు చెప్పింది విని విస్తుపోయిన వ్యాపారవేత్త.. తన రోగాలకూ భార్యే కారణమని తెలిసి..!

ఈ వాహనం రోడ్డు పైకి ఎక్కడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు ఈ విచిత్రమైన బైకును వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేం బైక్‌రా నాయనా..’’.. అంటూ కొందరు, ‘‘అద్భుతమైన ఐడియా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇంతకీ ఇది ట్రాక్టరా లేక బైకా’’.. అని ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇదెక్కడి విడ్డూరం.. నేలపై సిమెంట్‌ను బద్దలుకొట్టగా.. అడుగున షాకింగ్ దృశ్యం.. నీళ్లలో ఉండాల్సినవి కాస్తా..

Updated Date - 2023-08-10T15:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising