ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎస్కేప్ అంటే ఇదీ.. సింహానికే చావు రుచి చూపించిన జీబ్రా.. చివరకు మామూలు షాక్ ఇవ్వలేదుగా..

ABN, First Publish Date - 2023-09-12T21:59:59+05:30

అడవికి రాజైన సింహాలు.. పేరుకు తగ్గట్టుగానే ఎలాంటి జంతువునైనా ఇట్టే మట్టికరిపిస్తుంటాయి. ఒక్కసారి వాటి కంట పడితే ఇక ఆహారమైపోవాల్సిందే. పెద్ద పెద్ద జంతువలును వేటాడే సమయంలో ఓవైపు తమ ప్రాణాలు పోతున్నా మరోవైపు వేటను మాత్రం వదలకుండా పట్టుకుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం..

అడవికి రాజైన సింహాలు.. పేరుకు తగ్గట్టుగానే ఎలాంటి జంతువునైనా ఇట్టే మట్టికరిపిస్తుంటాయి. ఒక్కసారి వాటి కంట పడితే ఇక ఆహారమైపోవాల్సిందే. పెద్ద పెద్ద జంతువలును వేటాడే సమయంలో ఓవైపు తమ ప్రాణాలు పోతున్నా మరోవైపు వేటను మాత్రం వదలకుండా పట్టుకుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం సింహాలకు చుక్కలు కనపడుతుంటాయి. చిన్న చిన్న జంతువుల చేతిలో సైతం ఓడిపోయి నిరాశగా వెనుగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జీబ్రాను వేటాడేందుకు వెళ్లిన సింహానికి చివరకు చుక్కలు కనిపించాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సింహానికి మామూలు షాక్ ఇవ్వలేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆడ సింహం ఒంటరిగా ఉన్న జీబ్రాను (Lion attack on zebra) టార్గెట్ చేస్తుంది. సరైన సమయం చూసి వేగంగా వెళ్లి పంజా విసురుతుంది. సింహం దాడిని ఊహించని జీబ్రా.. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు పెడుతుంది. అయినా సింహం వదలకుండా జీబ్రా మెడను గట్టిగా పట్టుకుంటుంది. మరోవైపు జీబ్రా కూడా తన ప్రాణాలు కాపాడుకునేందుకు సింహంతో పోరాడుతుంది. సింహాన్ని కూడా ఈడ్చుకుంటూ పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో టూరిస్టు వాహనాలు (Tourist vehicles) వస్తున్న రోడ్డుపై దూకి, అటునుంచి అటే కిందకు దూసుకెళ్తుంది.

Viral Video: టెక్నాలజీని వాడుకోవడం అంటే ఇదేనేమో.. ఇకపై రైల్వే రైల్వే స్టేషన్లలో అంతా ఇలాగే చేస్తారేమో..

సింహం కూడా అలాగే జీబ్రాను పట్టుకుని ఉంటుంది. మధ్యలో రెండూ ఒకదానిపై ఒకటి పల్టీలు కూడా కొడతాయి. అయినా సింహం జీబ్రాను వదలదు. చివరకు గట్టిగా విదిలించగానే.. అప్పటికే అలసిపోయిన సింహం వదలిలేస్తుంది. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ జీబ్రా.. అక్కడి నుంచి అత్యంత వేగంగా పరుగెదుతుంది. దాన్ని పట్టుకోవడానికి సింహం ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ ఘటనను అక్కడే ఉన్న టూరిస్టులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అసలు సిసలు పిల్లి నటనను ఎప్పుడైనా చూశారా.. బుడ్డోడి దృష్టి మళ్లించడానికి ఈ పిల్లి ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-09-12T22:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising