ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎవరూ లేని సమయం చూసి.. బైకుపై కూర్చున్న బాలిక.. అపవిత్రమైందంటూ చివరకు యజమాని చేసిన పని..

ABN, First Publish Date - 2023-03-10T16:29:15+05:30

కొన్నిసార్లు కొందరు తెలిసీ తెలియక చేసే పనులు.. చూసేవారికి కోపం తెప్పిస్తుంటాయి. అలాగే మరికొన్ని సార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. నెటిజన్లనూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొన్నిసార్లు కొందరు తెలిసీ తెలియక చేసే పనులు.. చూసేవారికి కోపం తెప్పిస్తుంటాయి. అలాగే మరికొన్ని సార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. నెటిజన్లనూ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలిక ఎవరూ లేని సమయం చూసి సరదాగా బైకుపై కూర్చుంటుంది. అయితే చివరకు, అపవిత్రమైందంటూ యజమాని ఏం చేశాడంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ ఇంటి ముందు బైకు (bike) పార్కు చేసి ఉంటుంది. అదే సమయంలో కొందరు బాలికలు పాఠశాలకు వెళ్తుంటారు. వారిలో ఓ బాలిక (girl) బైకును చూసి ఎంతో ఇష్టపడుతుంది. దగ్గరికి వెళ్లి బైకు ఆనుకుని నిలబడి, తన స్నేహితుల వైపు ఓ లుక్కు ఇస్తుంది. అప్పటికీ ఆమె కోరిక తీరలేదో ఏమో గానీ.. తర్వాత బైకుపై కూర్చుని తన సరదా తీర్చుకుంటుంది. అనంతరం తన స్నేహితులతో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: ఈ పోలీసుల హోలీ వేడుకలు మామూలుగా లేవుగా.. ఫుల్‌గా మందు కొట్టి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే..

అయితే వీరిని మొదటి నుంచీ గమనిస్తున్న బైకు యజమాని (bike owner) .. వారు వెళ్లాక బయటకు వస్తాడు. వస్తూ వస్తూ ఓ బకెట్‌తో నీళ్లు తీసుకుని వస్తాడు. బైకుపై బాలిక కూర్చున్న ప్రదేశంలో నీళ్లు పోసి శుభ్రం చేసి వెళ్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇతను స్త్రీ ద్వేషి ఉన్నట్టున్నాడు.. అని కొందరు, వామ్మో! ఇతను చాలా తేడాగా ఉన్నాడే.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

Updated Date - 2023-03-10T16:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising