ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లిలో డాన్స్ చేస్తూనే పగ తీర్చుకున్న యువకుడు.. నవ్వుతూ నవ్వుతూనే చివరకు ఎంత పని చేశాడంటే భయ్యా..

ABN, First Publish Date - 2023-02-19T20:51:55+05:30

కొందరు పైకి సరదా సరదాగా కనిపించినా.. లోపల మనిషి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడు వారి పైత్యం మొత్తం బయటపడిపోతుంటుంది. ఈ క్రమంలో కొందరు పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు తమలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు పైకి సరదా సరదాగా కనిపించినా.. లోపల మనిషి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడు వారి పైత్యం మొత్తం బయటపడిపోతుంటుంది. ఈ క్రమంలో కొందరు పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు తమలోని పాండిత్యాన్ని, పైశాచికత్వాన్ని బయటపెడుతుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఇద్దరు యువకులు డ్యాన్స్ చేస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నవ్వుతూ డ్యాన్స్ చేస్తూనే మరో యువకుడిపై తన పగను ఎలా తీర్చుకున్నాడో చూసి.. నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (marriage Viral videos) అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో డీజే పాటలకు (DJ songs) యువకులు చిందులు వేస్తూ ఉంటారు. మధ్యలో ఇద్దరు యువకులు స్టేజి పైకి వస్తారు. వెంటనే సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా (Salman Khan Dabangg movie) పాట ప్లే అవుతుంది. ఇద్దరూ లయబద్ధంగా డ్యాన్స్ చేస్తుంటారు. అంతా వీరి డ్యాన్స్‌ని చూసి (youth Dance) ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మధ్యలో ఓ యువకుడికి ఉన్నట్టుండి పూనకం వస్తుంది. మనసులో ఏం పగ పెట్టుకున్నాడో తెలీదు గానీ.. నవ్వుతూ డ్యాన్స్ చేస్తూనే మరో యువకుడిని ఒక్కసారిగా పైకి ఎత్తుకుని ధమేల్‌మని కిందపడేస్తాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

స్నేహితుల కక్కుర్తితో ఆగిన పెళ్లి ఊరేగింపు.. వరుడు ఎంతకీ రాలేదని అంతా కంగారుపడుతుంటే.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

కింద పడ్డ యువకుడు.. ‘‘కొద్ది సేపు కుయ్యో.. ముర్రో.. అనుకుని’’.. ఎలాగైనా పోటాపోటీగా డ్యాన్స్ చేయాలి.. అనుకుంటూ ఓపిక లేకున్నా మళ్లీ లేచి డ్యాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు. అయితే అప్పటికీ పక్కన ఉన్న వ్యక్తికి కోపం తగ్గలేదేమో గానీ.. మళ్లీ వచ్చి అదే విధంగా ఎత్తుకుని కిందపడేస్తాడు. దీంతో పక్కన వారంతా పగలపడి నవ్వుకుంటారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకున్నావ్ రా.. నాయనా.. అని కొందరు, కింద పడ్డా మళ్లీ డ్యాన్స్ చేసేందుకు సిద్ధమైన యువకుడిని మెచ్చుకుంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పాములను పక్కలో పడుకోబెట్టుకున్న మహిళ.. అంతటితో ఆగకుండా మరీ విచిత్రంగా ఇదేంటీ..

Updated Date - 2023-02-19T20:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising