Viral Video: లేటు వయసులో డేంజరస్ స్టంట్స్.. ఈ పెద్దాయన సైకిల్ తొక్కే విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ABN, First Publish Date - 2023-04-30T15:33:44+05:30
కొందరు వృద్ధులకు వయసు కేవలం సంఖ్య మాత్రమే.. శారీరకంగా మాత్రం యువకులతో పోటీ పడుతుంటారు. ఇంకొందరైతే డేంజరస్ స్టంట్స్ చేస్తూ.. కుర్రకారుకు సవాల్ విసరుతుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా..
కొందరు వృద్ధులకు వయసు కేవలం సంఖ్య మాత్రమే.. శారీరకంగా మాత్రం యువకులతో పోటీ పడుతుంటారు. ఇంకొందరైతే డేంజరస్ స్టంట్స్ చేస్తూ.. కుర్రకారుకు సవాల్ విసరుతుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఓ పెద్దాయనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాటికి కాళ్లు చాపే వయసులో ఈ పెద్దాయన సైకిల్‌పై స్టంట్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌గా (Viral videos) మారింది. ఓ వృద్ధుడు (old man) సైకిల్‌పై వస్తాడు. ఆ వయసులో సైకిల్ తొక్కడమే గగనం అనుకుంటే ఈ పెద్దాయన మాత్రం అందరినీ ఖంగుతినిపించాడు. అందరిలా సైకిల్ (bicycle) తొక్కితే కిక్ ఏముంటుందీ అనుకున్నాడో ఏమోగానీ.. వినూత్నం ప్రయత్నం చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. సీటుపై కూర్చోకుండా హ్యాండిల్‌పై కూర్చున్నాడు. అది కూడా వెనక్కు తిరిగి కూర్చుని సైకిల్ తొక్కాడు. మధ్య మధ్యలో రోడ్డు వైపు చూస్తూ సైకిల్ తొక్కడం, అందులోనూ వేగంగా తొక్కడం (bicycle stunts) అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నా.. ఎక్కడా పట్టు తప్పకుండా హ్యాండిల్‌పై కూర్చుని, వెనక్కు తొక్కుతూ వెళ్లడం చూసి పక్కన వెళ్తున్న వాహనదారులు షాక్ అయ్యారు. చాలా దూరం వెళ్లాక చివరగా.. హ్యాండిల్‌ను కూడా వదిలేసి చేతులు పైకి ఎత్తి సైకిల్‌ను కంట్రోల్ చేశాడు. కొందరు బైకర్లు వృద్ధుడి విన్యాసాన్ని తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ పెద్దాయన టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘జాగ్రత్త తాతా.. ఇలాంటి విన్యాసాలు చాలా ప్రమాదకరం’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-04-30T15:33:44+05:30 IST