ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bride Video: ఆ వరుడు ప్రేమతో ఇస్తున్నా.. అస్సలు ముట్టుకోని వధువు.. ఆమె ప్రవర్తన చూసి నెటిజన్ల నుంచి ఊహించని కామెంట్స్..!

ABN, First Publish Date - 2023-06-28T15:30:39+05:30

ప్రస్తుతం చాలా మంది యువతులు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునేందుకు అవసరమైతే కుటుంబ సభ్యులను సైతం ఎదిరిస్తున్నారు. ఇంకొందరు యువతులు.. తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చి తమ ప్రేమను త్యాగం చేస్తుంటారు. ఇష్టం లేని వివాహాలు చేసుకున్న యువతులు.. మొదట్లో మానసికంగా ఇబ్బంది పడ్డా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం చాలా మంది యువతులు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునేందుకు అవసరమైతే కుటుంబ సభ్యులను సైతం ఎదిరిస్తున్నారు. ఇంకొందరు యువతులు.. తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చి తమ ప్రేమను త్యాగం చేస్తుంటారు. ఇష్టం లేని వివాహాలు చేసుకున్న యువతులు.. మొదట్లో మానసికంగా ఇబ్బంది పడ్డా క్రమక్రమంగా సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం తమ అయిష్టాన్ని వివాహ వేదికపైనే చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వరుడు ప్రేమతో తినిపిస్తున్నా.. వధువు మాత్రం అసలు ముట్టుకోలేదు. ఆమె ప్రవర్తన చూసి నెటిజన్ల నుంచి ఊహించని కామెంట్స్ వస్తున్నాయి..

సోషల్ మీడియాలో వివాహానికి సంబంధించిన వీడియో (Wedding viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. అతిథులందరి సమక్షంలో వధూవరులు (bride and groom) వివాహ వేదికపై దండలు మార్చుకుంటారు. ఈ సందర్భంగా వధువుకు వరుడు స్వీట్ తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. స్వీట్ (Sweet) తీసుకుని వధువు నోటికి అందిస్తాడు. అయితే వధువు మాత్రం ‘‘నాకీ స్వీటూ వద్దూ.. ఏమీ వద్దు’’.. అని అయిష్టంగా మొఖం పక్కకు తిప్పుకొంటుంది. దీంతో వరుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వధువు ఊహించని విధంగా ఇలా చేసేసరికి.. అందరి ముందు పరువు పోయినట్లుగా ఇబ్బందిపడతాడు. కాస్త చిరాకుగా స్వీట్‌ను ప్లేట్‌లో పడేసి.. సోఫాలో కూర్చుంటాడు. వధువు ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు.

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

వధువు పక్కన ఉన్న మహిళలు.. ‘‘ఏంటమ్మా.. ఇలా చేయొచ్చా.. వెళ్లి వరుడు పక్కన కూర్చో’’.. అని నచ్చజెబుతున్నా యువతి మాత్రం కూర్చునేందుకూ ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడు మరీ నల్లగా ఉండడంతో వధువుకు కోపం వచ్చినట్లుంది’’.. అని ఒకరు, ‘‘గవర్నమెంట్ జాబ్ మహత్యం అయ్యుంటుంది’’.. అని మరొకరు, ‘‘కలర్ కాదు ముఖ్యం.. మంచి మనసు ముఖ్యం’’.. అని ఇంకొకరు, ‘‘ఈ జంట సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం’’.. అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంత చేసుకుంది.

Viral Video: కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!

Updated Date - 2023-06-28T15:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising