ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: పెళ్లిలో పనిచేయని ఏసీ.. ఉక్కపోత భరించలేక స్నేహితులకు ఒక్క సైగ చేసిన వధువు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-06-01T21:26:16+05:30

వేసవిలో ఉక్కపోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో చాలా మంది ఇళ్లల్లో కూలర్లు, ఏసీలు విరివిగా వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు కరెంట్ కోతల కారణంగా ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఇళ్లల్లోనే ఇలా ఉంటే ఇక ఫంక్షన్ల సమయంలో ఇంకెలా ఉంటుందో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవిలో ఉక్కపోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో చాలా మంది ఇళ్లల్లో కూలర్లు, ఏసీలు విరివిగా వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు కరెంట్ కోతల కారణంగా ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఇళ్లల్లోనే ఇలా ఉంటే ఇక ఫంక్షన్ల సమయంలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓ వివాహ సమయంలో వధువుకు ఇలాంటి సమస్యే వచ్చి పడింది. పెళ్లిలో ఏసీ పని చేయకపోవడంతో ఉక్కపోత భరించలేక వధువు తన స్నేహితులకు సైగ చేసింది. దీంతో చివరకు ఆమె స్నేహితులంతా ఏం చేశారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో (wedding ceremony) వధూవరులు దండలు మార్చుకున్న అంనతరం అతిథులతో ఫొటోలు (Photos) దిగుతూ ఉంటారు. అంతలో ఒక్కసారిగా మంటపంలో కరెంట్ పోతుంది. ఏసీ పనిచేయకపోవడంతో వధూవరులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ఎలాగోలా భరించి, పైకి నవ్వుతూ అందరితో ఫొటోలు దిగుతూ ఉంటారు. అయితే వధువుకు (bride) మాత్రం చివరకు ఓపిక నసిస్తుంది. తీవ్రమైన ఉక్కపోతను భరించలేక.. తన స్నేహితులకు సైగ చేస్తుంది. ‘‘ఏంటీ ఉక్కపోత.. భరించలేకున్నా.. ఏదోటి చేయండి’’.. అంటూ చేత్తో సైగ చేస్తుంది.

Wife: ఆరుగురు పిల్లల తల్లి.. ఇలా చేస్తుందని భర్త కూడా ఊహించలేదు.. ఎండాకాలం కదా అని ఇంటి ముందు మంచం వేసుకుని పడుకుంటే..!

దీంతో స్నేహితులకు చివరకు ఓ ఐడియా వస్తుంది. అప్పటికే పెళ్లిలోని దృశ్యాలను చిత్రీకరిస్తున్న డ్రోన్‌ను (drone) .. వధువు వైపు తీసుకెళ్తారు. డ్రోన్ రెక్కల కారణంగా చల్లటి గాలి రావడంతో వధువు రిలాక్స్ అవుతుంది. హమ్మయ్య! అనుకుంటూ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫొటోగ్రాఫర్ అదనపు చార్జి చేయొచ్చు జాగ్రత్త’’.. అని కొందరు, ‘‘ఇలాంటి స్నేహితులను అభినందిచాల్సిందే’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

Updated Date - 2023-06-01T21:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising