ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇంట్లోంచి అదే పనిగా ఓ పిల్లి అరుపులు.. ఎక్కడ ఉందో కనిపెట్టలేక ఆగమాగం.. చివరకు డ్రైనేజీ పైపులో చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-20T17:24:58+05:30

పెంపుడు జంతువుల ప్రవర్తన కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. ప్రధానంగా కుక్కలు, పిల్లులు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్ని జంతువులు మనుషులను అనుకరిస్తే.. మరికొన్ని జంతువులు వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటాయి. వీటి ప్రవర్తన చూసి...

పెంపుడు జంతువుల ప్రవర్తన కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. ప్రధానంగా కుక్కలు, పిల్లులు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్ని జంతువులు మనుషులను అనుకరిస్తే.. మరికొన్ని జంతువులు వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటాయి. వీటి ప్రవర్తన చూసి యజమానులు తెగ సంబరపడిపోతుంటారు. అయితే కొన్నిసార్లు ఇదే పెంపుడు జంతువుల ప్రవర్తన.. అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఇంట్లోంచి అదే పనిగా పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో పిల్లిని కనిపెట్టలేక సదరు ఇంటి యజమానుల తల ప్రాణం తోకకు వచ్చింది. చివరకు డ్రైనీజీ పైపులో ఇరుక్కున్న పిల్లిని చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ దాన్ని ఎలా బయటకు తీశారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఇంట్లో పిల్లి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు. ఓ రోజు ఉన్నట్టుండి ఆ ఇంట్లో పిల్లి అరుపులు (Cat scream) వినిపించసాగాయి. దీంతో ఇంట్లో ఏదో మూల ఉందేమో అని అంతా అనుకున్నారు. ఇల్లు మొత్తం వెతికినా పిల్లి మాత్రం ఎక్కడా కనిపించలేదు. మరోవైపు అరుపులు మాత్రం ఏకదాటిగా వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో కంగారుపడిన ఇంటి యజమానులు ఇంటి పరిసరాలను క్షణ్ణంగా పరిశీలించారు. చివరకు డ్రైనేజీ పైపు నుంచి (cat stuck in drainage pipe) అరుపులు వినిపిస్తున్నట్లు గుర్తించారు. పైపులో ఉన్న పిల్లిని బయటకు తీయడం సాధ్యం కాక.. తెలిసిన వారికి సమాచారం అందించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న యువకులు.. ముందుగా పైపులో పిల్లి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

Metro Train Video: మెట్రో రైల్లో మస్తు షో చేసిన కుర్రాడు.. పక్కన నిల్చున్న ఆ పెద్దాయన రియాక్షన్‌తో అతడికి మైండ్‌బ్లాక్..!

తర్వాత పిల్లికి సమీపంలో పైపును రంపం బ్లేడుతో కట్ చేశారు. ఓపెన్ చేసి చూడగా.. ఆశ్చర్యకరంగా పిల్లి లోపల నక్కి ఉంది. పైపులోకి ఆ పిల్లి ఎలా వెళ్లిందో అర్థం కాక.. అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి పిల్లిని క్షేమంగా బయటకు తీశారు. ఎట్టకేలకు పిల్లి ఆరోగ్యంగా ఉండడంతో అంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘‘అంత లోపలికి ఈ పిల్లి ఎలా వెళ్లిందబ్బా’’.. అని కొందరు, ‘‘పిల్లిని కాపాడిన యువకుడికి ధన్యావాదాలు’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ పిల్లికి భూమ్మీద ఇంకా నూకలున్నాయ్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19లక్షలకు పైగా లైక్‌లను సొతం చేసుకుంది.

Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. మల్టీప్లెక్స్‌లలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ఖరీదు ఎక్కువని ఏం చేశాడో మీరే చూడండి..!

Updated Date - 2023-09-20T17:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising