ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.. కావాలంటే ఈ కుక్కను చూడండి..

ABN, First Publish Date - 2023-05-10T21:44:46+05:30

అనుకున్నది సాధించాలనే తపనతో కొందరు రాత్రింబవళ్లూ శ్రమిస్తుంటారు. అయితే మధ్యలో ఉన్నట్టుండి నిరాశకు లోనై తమ లక్ష్యాలను మార్చుకుంటుంటారు. ఇంకొందరు జీవితంలో అనుకున్నది సాధించలేక.. ఇష్టం లేని పనులు చేస్తూ నిరాశతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుకున్నది సాధించాలనే తపనతో కొందరు రాత్రింబవళ్లూ శ్రమిస్తుంటారు. అయితే మధ్యలో ఉన్నట్టుండి నిరాశకు లోనై తమ లక్ష్యాలను మార్చుకుంటుంటారు. ఇంకొందరు జీవితంలో అనుకున్నది సాధించలేక.. ఇష్టం లేని పనులు చేస్తూ నిరాశతో కాలం వెల్లదీస్తుంటారు. కానీ కొందరు మాత్రం లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి.. చివరకు తమ కోరికలను నెరవేర్చుకుంటుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ కుక్కకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో కుక్కకు సంబంధించిన వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క (dog) తాను అనుకున్న దిశగా వెళ్లే క్రమంలో ఓ పెద్ద ప్రహరీ అడ్డు వస్తుంది. చుట్టూ తిరిగి వెళ్తే ఆలస్యం అవుతుంది అనుకుందో ఏమో గానీ.. ఎలాగైనా ప్రహరీ (Compound wall) పైకి ఎగిరి అటువైపునకు దిగిపోవాలని అనుకుంటుంది. అయితే అది అంత సులభం కాదని మొదటి ప్రయత్నంలోనే అర్థమవుతుంది. అయినా మళ్లీ ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ప్రహరీ పైకి ఎక్కడం సాధ్యం కాదు. ఇలా చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ వీలు కాదు.

Viral Video: వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా తెగిపోయిన దండ.. వరుడు కంగారుపడుతుంటే.. మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ప్రహరీ పైకి ఎక్కాలని చూడడం, సాధ్యం కాక కిందపడడంతో కుక్క బాగా అలసిపోతుంది. మధ్యలో గోడ వైపు చూస్తూ కొద్ది సేపు అలాగే నిలబడుతుంది. ‘‘ఈ గోడ పైకి ఎక్కడం నా వల్ల కాదంటావా!.. అయినా సరే సాధించి తీరుతా’’.. అని అనుకుంటూ శక్తిని మొత్తం కూడదీసుకుని మళ్లీ ప్రయత్నిస్తుంది. కానీ కింద పడిపోతుంది. చివరగా మరింత ఉత్సాహంతో ప్రయత్నించి.. ఎట్టకేలకు గోడ పైకి ఎక్కుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ కుక్కను చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

Updated Date - 2023-05-10T21:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising