ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: తల లేకున్నా చెరువులో ఈదుతున్న.. ఈ చేపను చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2023-05-12T18:21:20+05:30

సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా పలు రకాల చేపలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. పూర్తిగా ఎండిపోయిన చేపలు.. నోటిలో నీరు పోయగానే ప్రాణం రావడం గతంలో చూశాం. అలాగే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా పలు రకాల చేపలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. పూర్తిగా ఎండిపోయిన చేపలు.. నోటిలో నీరు పోయగానే ప్రాణం రావడం గతంలో చూశాం. అలాగే మనుషులను భయపట్టే చేపలను కూడా చూశాం. ప్రస్తుతం తల లేని చేప.. నీటిలో ఈదుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పూర్తిగా తలను కొట్టేసినట్లుగా ఉన్న చేప.. ఆశ్చర్యకరంగా మిగతా చేపల మాదిరే ఈదడం చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ చేప అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. పూర్తిగా తల లేకుండా ఉన్న ఈ చేప (headless fish) .. మిగతా చేపల మాదిరే ఈదుకుంటూ వెళ్తుంది. ఈ చేపను చూస్తే.. ఇదెలా సాధ్యం అని అనిపించేలా ఉంది. నీటి అడుగు నుంచి ఈదుకుంటూ పైకి వచ్చింది. ఎవరైనా ఆహారం వేస్తున్నారేమో అని ఆసక్తిగా ఎదురు చూసింది. ఓ వ్యక్తి వేలుతో తలను తాకుతున్నా కదలకుండా అలాగే ఉండిపోతుంది.

Viral News: పొరిగింటి వారిని ఖాళీ చేయించేందుకు మహిళ ప్లాన్.. రోజూ రాత్రిళ్లు ఎవరికీ తెలీకుండా ఆమె చేసిన పని.. చివరకు..

ఈ చేపను చూస్తే... ఎవరైనా తలను కట్ చేసి, నీటిలో పడేశారా అని అనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది కలా లేక నిజమా’’.. అని కొందరు, ‘‘ఇలాంటి చేపను మేమెప్పుడూ చూడలేదు’’.. అని మరికొందరు, ‘‘ చేప తల తీసేసినా కొద్ది సేపు ఈదగలవు. తోక సమీపంలో ఉన్న వెన్నెముఖ సాయంతో ఇది సాధ్యమవుతుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైకులో వెళ్తున్న ప్రేమికులకు.. సడన్ షాక్ ఇచ్చిన స్నేహితులు.. బండిని ఫాలో అవుతూ చివరకు వీరు చేసిన పని..

Updated Date - 2023-05-12T18:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising