ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. ఏం చేస్తున్నాడని అవాక్కవుతున్నారా..? భార్యను పిలిచి.. గ్యాస్ లైటర్‌ను కాల్చి.. జుట్టుకు చుట్టి..!

ABN, First Publish Date - 2023-09-15T16:11:12+05:30

ప్రస్తుత యువత అందానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. డ్రస్సింగ్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ప్రతి విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కొందరైతే హెయిర్ సెలూన్లలో వేలకు వేలు ఖర్చు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అంత ఖర్చు చేయలేని కొందరు...

ప్రస్తుత యువత అందానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. డ్రస్సింగ్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ప్రతి విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కొందరైతే హెయిర్ సెలూన్లలో వేలకు వేలు ఖర్చు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అంత ఖర్చు చేయలేని కొందరు ఇళ్లల్లోనే వివిధ రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. మరికొందరు య్యూటూబ్ వీడియోలు చూస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్కక్తి రూపాయి ఖర్చు చేయకుండా తన భార్య జుట్టును స్టైల్‌గా మార్చడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. తన జుట్టును స్టైల్‌గా మార్చుకోవాలన్న భార్య కోరికను భర్త అత్యంత తెలివిగా తీర్చేశాడు. భర్త ఓకే చెప్పగానే ఏదైనా హెయిర్ సెలూన్‌కి తీసుకెళ్తాడేమో అని ఆమె అనుకుంటుంది. కానీ అతను అలాంటిదేమీ చేయకుండా.. భార్యను తీసుకుని వంటింట్లోకి వెళ్తాడు. గ్యాస్ పొయ్యి (Gas stove) మండించి దానిపై లైటర్‌ను వేడి చేస్తాడు. కాస్త వేడి కాగానే బయటకు తీసి, పక్కనే ఉన్న భార్య జుట్టును దానికి చుట్టేస్తాడు. ఇలా కొద్ది సేపు ఉంచి తర్వాత (gas lighter) లైటర్‌ను తీసేస్తాడు.

Viral Video: వర్షం వస్తోందని చెట్టు కిందకు వెళ్లిన మహిళలు.. కాసేపటికి అంతా చూస్తుండగా ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి..

ఫైనల్‌గా చూస్తే.. ఆమె జుట్టు రింగులు రింగులు తిరిగి చూడటానికి స్టైల్‌గా కనిపిస్తుంది. రూపాయి ఖర్చు చేయకుండా జుట్టును స్టైల్‌గా మారిపోవడం చూసి ఆమె ఎంతో మురిసిపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఇతడి ఐడియా అద్భుతంగా ఉంది’’.. అని కొందరు, ‘‘అరె! ఇంత సింపుల్‌గా జుట్టును ఇలా మార్చుకోవచ్చా’’.. అని మరికొందరు, ‘‘మాకు ఈ టెక్నిక్ తెలీక.. అనవసరంగా చాలా ఖర్చు చేశామే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Indian Railway: బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే..!

Updated Date - 2023-09-15T16:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising