ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కేవలం 30 సెకన్లలోనే ఓ జీవిని మింగేసి మాయం చేసేసింది.. నెటిజన్లను విస్తుపోయేలా చేస్తున్న వీడియో ఇది..!

ABN, First Publish Date - 2023-05-26T18:51:29+05:30

వేటాడటంలో ఒక్కో జంతువు స్టైల్.. ఒక్కోలా ఉంటుంది. మెరుపు వేగంతో వెంటాడి వేటాడే పులులు, సింహాలను చూశాం, నీటిలో నక్కి నక్కి ఉంటూ సమీపానికి వచ్చిన వేటను అమాంతం నోట కరుచుకునిపోయే మొసళ్లను చూశాం, అలాగే ఆకాశంలో ఎంతో ఎత్తు నుంచే వేటను గుర్తు పట్టి, చటుక్కున..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేటాడటంలో ఒక్కో జంతువు స్టైల్.. ఒక్కోలా ఉంటుంది. మెరుపు వేగంతో వెంటాడి వేటాడే పులులు, సింహాలను చూశాం, నీటిలో నక్కి నక్కి ఉంటూ సమీపానికి వచ్చిన వేటను అమాంతం నోట కరుచుకునిపోయే మొసళ్లను చూశాం, అలాగే ఆకాశంలో ఎంతో ఎత్తు నుంచే వేటను గుర్తు పట్టి, చటుక్కున దాడి చేసే పక్షులను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఓ అరుదైన జంతువు వేటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. కేవలం 30 సెకన్లలోనే ఓ జీవిని మింగేసి మాయం చేసిన ఈ జంతువును చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు.

మానిటర్ లిజర్డ్ (రాకాసి బల్లి) జాతికి చెందిన కొమాడో డ్రాగన్ (komodo dragon) వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ అటవీ ప్రాంతంలో (Forest area) ఓ జంతువు మేత మేస్తూ ఉంటుంది. దానికి కొంచెం సమీపంలో పెద్ద రాకాసి బల్లి కాపు కాసి ఉంటుంది. వేటను టార్గెట్ చేసిన కొమాడో డ్రాగన్.. నక్కి నక్కి అడుగులో అడుగు వేసుకుంటూ కొంచెం దూరం వస్తుంది. వేట సమీపానికి చేరుకోగానే ఒక్క ఉదుటున దానిపై దాడి (attack) చేస్తుంది. అంత పెద్ద జంతువును నోటితో గట్టిగా అదిమిపడుతుంది.

Viral Video: మట్టి కుండలతో.. చిన్న ట్రిక్‌తో కూలర్ నుంచే ఏసీని మించిన కూలింగ్.. అసలు ఎలా సాధ్యమో మీరే చూడండి..!

మరుక్షణమే మొదట జంతువు తల భాగాన్ని మింగేస్తుంది. వెను వెంటనే జంతువును (Komado dragon devoured an animal) కొంచెం కొంచెం లోపలికి మింగేస్తుంది. ఇలా 30 సెకన్ల వ్యవధిలోనే ఆ జంతువును మొత్తం మింగేస్తుంది. ఈ రాకాసి బల్లులు ఎక్కువగా ఇండోనేషియాలోని (Indonesia Animals) కొమోడో, రింకా, ఫ్లోర్స్, గిలి మోటాంగ్ మరియు గిలి దశమి దీవులలో కనిపిస్తాయి. బల్లుల జాతుల్లో పరిమాణంలో ఇవి అతిపెద్దవి. కొమాడో డ్రాగన్లు సుమారు 3.5 మీటర్ల పొడవు, 136 కిలోల వరకు బరువు ఉంటాయి. కాగా, ఈ కొమాడో డ్రాగన్ వేట చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం 18 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

Updated Date - 2023-05-26T18:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising