ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇదెక్కడి గేమ్‌రా బాబోయ్.. యువకుడిని టైరులో కుక్కి తోయడంతో చివరకి ఏం జరిగిందో చూడండి..

ABN, First Publish Date - 2023-08-31T15:41:20+05:30

చిన్నప్పుడు పాత సైకిల్ టైర్లను పోటాపోటీగా కర్రలతో తోసుకుంటూ వెళ్లడం దాదాపు అందరూ చేసే ఉంటారు. ఇంకొంత పెద్ద వయసు వచ్చాక.. బైకు టైర్లతో కూడా ఇలాంటి పనులు చేసే ఉంటారు. తెలిసీ తెలీని వయసులో ఆడుకున్న ఇలాంటి ఆటలు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

చిన్నప్పుడు పాత సైకిల్ టైర్లను పోటాపోటీగా కర్రలతో తోసుకుంటూ వెళ్లడం దాదాపు అందరూ చేసే ఉంటారు. ఇంకొంత పెద్ద వయసు వచ్చాక.. బైకు టైర్లతో కూడా ఇలాంటి పనులు చేసే ఉంటారు. తెలిసీ తెలీని వయసులో ఆడుకున్న ఇలాంటి ఆటలు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది ప్రమాదకర ఆటలు ఆడటం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొందరు యువకులంతా కలిసి.. ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో టైరు ఆట ఆడాలని అనుకున్నారు. టైరును తోయడం కాకుండా.. టైరులో మనిషిని కుక్కి తోస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నారు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులంతా కలిసి టైరు ఆట (tire game) ఆడాలని అనుకున్నారు. అది కూడా అందరిలా కాకుండా వినూత్నంగా ఆడాలని నిర్ణయించుకున్నారు. పరుగెత్తుకుంటూ టైరు తోయడం కాకుండా.. టైరు మధ్యలో మనిషిని పడుకోబెట్టి తోసేస్తే ఎలా ఉంటుందని అనుకుని.. చివరకు ఓ యువకుడిని పెద్ద టైరు మధ్యలో పడుకోబెట్టి తోశారు. ఎత్తైన ప్రదేశం నుంచి తోయడంతో టైరు వేగంగా దూసుకొచ్చింది. దాని మధ్యలో ఉన్న యువకుడు కాసేపు సరదాగానే కనిపించాడు. అయితే వేగంగా కిందకు వెళ్లిన టైరు.. అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.

Viral Video: ప్రాణభయంతో ప్రశాంతంగా తినగలరా..? లక్షలు ఇస్తామన్నా ఈ రిస్క్ చేయలేమంటున్న నెటిజన్లు..!

ఇంకేముందీ, అంతా చూస్తుంగానే టైరు అత్యంత వేగంగా లోయలోకి వెళ్లిపోయింది. సరదాగా మొదలెట్టిన ఆట కాస్తా.. సీరియస్‌గా మారడంతో చుట్టూ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఎలాగైనా టైరును ఆపాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల అది సాధ్యం కాలేదు. చూస్తుండగానే లోయ దిగువవైపునకు వెళ్లిపోయింది. వెనుకే వస్తున్న వాళ్లు.. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. అయితే చివరికి ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘మరీ ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ’’.. అని కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదకరం’’.. అని మరికొందరు, ‘‘పాపం! అతడి పరిస్థితి ఏంటో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman: 3 వారాలుగా ఓ మహిళకు జ్వరం.. ఎమ్మారై స్కాన్ చేసిన డాక్టర్లకు షాక్.. ఏం చేయాలో తెలియక శాస్త్రవేత్తల వద్దకు వెళ్తే..!

Updated Date - 2023-08-31T15:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising