ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: హైస్పీడ్‌తో వెళ్తున్న లారీలోంచి మేకల్ని కిందకు విసిరేస్తున్న యువకుడు.. కాపాడుతున్నాడేమో అనుకుంటే.. షాకింగ్ ట్విస్ట్..!

ABN, First Publish Date - 2023-05-02T19:53:30+05:30

చాలా మంది దొంగల తెలివితేటలు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది. పెద్ద పెద్ద చోరీలను సైతం ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా చేసేస్తుంటారు. ఇలాంటి కేసులు పోలీసులను కూడా షాక్‌కి గురి చేస్తుంటాయి. వినూత్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా మంది దొంగల తెలివితేటలు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది. పెద్ద పెద్ద చోరీలను సైతం ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా చేసేస్తుంటారు. ఇలాంటి కేసులు పోలీసులను కూడా షాక్‌కి గురి చేస్తుంటాయి. వినూత్న చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మేకలకు సంబంధించిన వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హైస్పీడ్‌తో వెళ్తున్న లారీలోంచి మేకల్ని కిందకు విసిరేస్తుంటాడు. ఈ వీడియో చూసిన వారంతా ముందు.. అతను మేకలను కాపాడుతున్నాడేమో అని అనుకున్నారు. కానీ చివరకు అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు..

మహారాష్ట్రలోని (Maharashtra) ఇగత్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఓ హైవే మార్గంలో చాలా వాహనాలు (Vehicles) రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మేకలను తీసుకెళ్తున్న లారీలోకి రన్నింగ్‌లోనే (Running lorry) ఎక్కేస్తాడు. నేరుగా లోపలికి వెళ్లి అందులో ఉన్న మేకలను ( goats) ఒక్కొక్కటిగా రోడ్డు పైకి విసిరేస్తాడు. ఇలా చాలా మేకలను కింద పడేస్తూ వెళ్తాడు. కింద పడ్డ వాటిలో చాలా మేకలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Viral news: బంధువులంతా ఎదురు చూస్తుంటే.. ఎవరికీ తెలియదులే అనుకుంటూ.. వివాహానికి కాస్త ముందు వధువు చేసిన పనితో.. చివరకు..

చాలా దూరం ఇలా మేకలను కింద పడేసిన వ్యక్తి.. తర్వాత లారీ నుంచి దిగే ప్రయత్నం చేస్తాడు. చాలా సేపటి నుంచి లారీని అనుసరిస్తూ వెళ్తున్న కారు.. తర్వాత లారీ వెనుక సమీపానికి వెళ్తుంది. లారీపై ఉన్న వ్యక్తి చాకచక్యంగా కారు పైకి దిగుతాడు. వీరంతా మేకలను ఎత్తుకెళ్లే ముఠాగా (Goat stealing gang) పోలీసులు తెలిపారు. కింద పడ్డ మేకలను వెనుక ఉన్న వాహనంలోని వారు ఎక్కించుకుని, తర్వాత వేరే ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాగా, మేకల చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral News: ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతిని ఎలా అయ్యానంటూ ఓ మహిళకు డౌట్.. జరిగింది తెలిసి న్యాయపోరాటం.. చివరకు..

Updated Date - 2023-05-02T19:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising