Viral Video: మట్టి కుండలతో.. చిన్న ట్రిక్‌తో కూలర్ నుంచే ఏసీని మించిన కూలింగ్.. అసలు ఎలా సాధ్యమో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-05-26T15:22:57+05:30
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. తల మీద నిప్పుల కుంపటి పెట్టినట్లు ఉండడంతో బయటికి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. దీంతో శీతలపానీయాలు సేవిస్తూ జనం ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వేసవి కావడంతో మరోవైపు ఏసీలు, కూలర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. తల మీద నిప్పుల కుంపటి పెట్టినట్లు ఉండడంతో బయటికి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. దీంతో శీతలపానీయాలు సేవిస్తూ జనం ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వేసవి కావడంతో మరోవైపు ఏసీలు, కూలర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా మంది తమ ఇళ్లలో పాత, చెడిపోయిన కూలర్లను పక్కన పడేసి.. కొత్త వాటిని కొనుక్కుంటున్నారు. అయితే అంత డబ్బులు ఖర్చు పెట్టలేని కొందరు.. ఉన్న వాటితో సర్దుకుపోతున్నారు. అయితే మరికొందరు మాత్రం చెడిపోయిన కూలర్లతోనే వినూత్న ప్రయోగాలు చేసి, ఏసీని తలపించేలా చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మట్టి కుండల ద్వారా చిన్న ట్రిక్‌తో కూలర్ నుంచే ఏసీని మించిన కూలింగ్ తెప్పించాడు. ఎలా చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కేవరలం రూ.10లు ఖర్చుతో పాత కూలర్‌ని (old cooler) మట్టి కుండలతో సరికొత్త ఏసీ తరహాలో మార్చిన విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా ఓ కుండకు (pot) కింది వైపు పెద్ద రంధ్రం చేశాడు. తర్వాత మరికొన్ని పాత కుండలను పగులగొట్టి ముక్కలు చేసి పెట్టుకున్నాడు. తర్వాత రంధ్రం ఉన్న కుండను కూలర్ కింది భాగంలో పెట్టాడు. కూలర్ పైపులను కుండ లోపల ఫిట్ చేసిన తర్వాత పగులగొట్టిన కుండ పెంకులను చుట్టూ పేర్చేశాడు.
చివరగా అందులో నీరు నింపి స్విఛ్ ఆన్ చేస్తాడు. దీంతో ఏసీ తరహాలో చల్ల గాలి రావడం మొదలవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సహజ సిద్ధమైన ఏసీ’’.. అంటూ కొందరు, ‘‘ఈ వ్యక్తి తెలివితేటలు అద్భుతం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ఏసీ మాకూ కావాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్‌కి పైగా లైకులను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి.. మీ ఇంట్లోనూ ఇలాంటి ఏసీని ఏర్పాటు చేసుకోండి..
Updated Date - 2023-05-26T15:22:57+05:30 IST