Viral Video: నీటి అడుగులో డైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఎద్దురుపడ్డ కొండచిలువ.. సమీపానికి వచ్చి సడన్‌గా ఏం చేసిందంటే..
ABN, First Publish Date - 2023-04-28T21:48:30+05:30
క్రూర జంతువులు, విష సర్పాలతో కొందరు స్నేహంగా ఉంటే... మరికొందరు వాటితో చెలగాటమాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు ఇలాంటి వాటి బారి నుంచి త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు..
క్రూర జంతువులు, విష సర్పాలతో కొందరు స్నేహంగా ఉంటే... మరికొందరు వాటితో చెలగాటమాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు ఇలాంటి వాటి బారి నుంచి త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు చోటు చేసుకునే ఊహించని ఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటి అడుగులో డైవింగ్ చేస్తున్న వ్యక్తికి.. ఓ భారీ కొండచిలువ ఎదురుపడుతుంది. సమీపానికి వచ్చి సడన్‌గా ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ వ్యక్తి సముద్రం (sea) అడుగున డైవింగ్ (diving) చేస్తుంటాడు. నీటి అడుగు భాగంలోని అందమైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఎదురుగా ఓ పెద్ద కొండచిలువ (python) వేట కోసం వెతుకుతూ అటుగా వెళ్తుంది. దీంతో మొదట భయపడిపోయిన సదరు వ్యక్తి.. చివరకు తెగించి పాము ఎదురుగా వెళ్తాడు. కొండచిలువ కూడా అతన్ని మింగేసేలా దగ్గరికి వెళ్తుంది.
అయితే అతను మాత్రం తన చేతిలోని కెమెరాను పాము ముఖంపై దగ్గరగా పెట్టి వీడియో (Video) చిత్రీకరిస్తాడు. చాలా సేపు ఎదురెదురుగా చూసుకున్నాక.. కొండచిలువ ఉన్నట్టుండి మనసు మార్చుకుంటుంది. ‘‘నిన్నేం చేయను.. వెళ్లిపో’’.. అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! చాలా భయానకంగా ఉంది’’.. అని కొందరు, ‘‘ఇతడి టైం చాలా బాగుంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-04-28T21:48:30+05:30 IST