ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horse funny video: అద్దంలో చూసుకుని అమ్మాయిలా సిగ్గుపడిపోయిన గుర్రం.. చివరికి ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, First Publish Date - 2023-09-01T21:53:07+05:30

అద్దంలో అందం చూసుకుని మురిసిపోవడం మనుషులకు మామూలే. అదే జంతువులు తమని తాము అద్దంలో చూసుకుంటే ఎలా ప్రవర్తిస్తాయో ఊహించుకోండి. ఈ తరహా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అడవుల్లో ఏర్పాటు చేసిన అద్దాల ముందు...

అద్దంలో అందం చూసుకుని మురిసిపోవడం మనుషులకు మామూలే. అదే జంతువులు తమని తాము అద్దంలో చూసుకుంటే ఎలా ప్రవర్తిస్తాయో ఊహించుకోండి. ఈ తరహా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అడవుల్లో ఏర్పాటు చేసిన అద్దాల ముందు కోతులు, చింపాజీలు, పులులు, సింహాలు తదితర జంతువులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూశాం. అయితే ప్రస్తుతం ఓ గుర్రం అద్దం ముందు ప్రవర్తించిన తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ షెడ్డులోకి అడుగుపెట్టిన గుర్రం.. ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుని అమ్మాయిలా మురిసిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ గుర్రం వీడియో (Horse video) తెగ చక్కర్లు కొడుతోంది. రేకుల షెడ్డులోకి వెళ్లిన గుర్రం.. ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుని షాక్ అవుతుంది. ‘‘అరే! ఇదేంటీ ఎదురుగా.. అచ్చం నా లాంటి గుర్రం.. నాలాగే ప్రవర్తిస్తుందే’’.. అని అనుకుని విచిత్రంగా చూస్తుంది. మొదట్లో భయపడి తలను అటూ ఇటూ తిప్పుతూ చెక్ చేస్తుంది. మళ్లీ అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. తర్వాత మధ్య మధ్యలో అద్దం దగ్గర (horse looking at himself in mirror) తల పెట్టి తీక్షణంగా చూసుకుంటుంది. తర్వాత మళ్లీ ముందుకు, వెనక్కు కదులుతూ పరిశీలిస్తుంది. ఇలా చాలా సేపు పరిశీలించిన తర్వాత కూడా అద్దంలో తన ప్రతిరూపమే కనిపిస్తుండడంతో గుర్రానికి చివరకు భయం మొదలవుతుంది.

Viral Video: వావ్!.. ఈ గ్రామస్తుల తెలివితేటలు అమోఘం.. అడవి మధ్యలో ఇరుక్కుపోయిన కారును చిన్న ట్రిక్‌తో ఎలా బయటికి తీశారంటే..

చివరకు.. ‘‘ఇదేదో విచిత్రం జంతువులా ఉంది బాబోయ్! ఎందుకొచ్చిన గొడవ.. ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచింది’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. ఈ తమాషా సంఘటనను మొత్తం గుర్రం యజమాని తన ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) చేస్తున్నారు. ‘‘అద్దంలో చూసుకుని అచ్చం అమ్మాయిలా సిగ్గుపడుతోందే’’.. అని కొందరు, ‘‘ఈ గుర్రం వెరైటీగా ఉన్నట్టుందే’’.. అని మరికొందరు, ‘‘ఇది వెరీ ఫన్నీ గుర్రం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Updated Date - 2023-09-01T21:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising