ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఓరి దేవుడో.. పెళ్లి రోజే ఇంత రిస్కేంటి..? ఈ వధూవరులు హ్యాపీగా వివాహం చేసుకోకుండా ఇదేం పని..?

ABN, First Publish Date - 2023-09-23T15:20:57+05:30

ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వేసి వివాహం చేయాలనేది పాత మాట. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అంతా హైటెక్ పద్ధతులకు అలవాటు పడుతున్నారు. కన్నులవిందుగా జరిగే వివాహాలను ఒకప్పుడు కేవలం సినిమాల్లోనే చూశేవాళ్లం.. కానీ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత వివాహాల్లో ...

ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వేసి వివాహం చేయాలనేది పాత మాట. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అంతా హైటెక్ పద్ధతులకు అలవాటు పడుతున్నారు. కన్నులవిందుగా జరిగే వివాహాలను ఒకప్పుడు కేవలం సినిమాల్లోనే చూశేవాళ్లం.. కానీ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత వివాహాల్లో సినిమాలను మించి ఊహించని చిత్రవిచిత్రమైన ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి విచిత్ర వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఓరి దేవుడో.. పెళ్లి రోజే ఇంత రిస్కేంటి..?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిని బట్టి.. వివాహ వేడుకలను (Wedding ceremonies) ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులోనూ సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో కార్యక్రమంలోని ప్రతి ఘట్టాన్నీ వినూత్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా, ఓ జంట ఇలాగే చేసింది. వివాహ మంటపంలోకి వధూవరులు వినూత్నంగా ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి దుస్తులో ముస్తాబైన వధూవరులు (bride and groom) మంటపం వద్దకు రాగానే.. ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేశారు. దుస్తులకు నిప్పు (fire) అంటించుకుని, చెట్టాపట్టాలేసుకుని నడుచుకుంటూ రావడం చూసి అంతా షాక్ అయ్యారు.

Viral Vide: అయ్య బాబోయ్! ఈ యువతి పామును ఎలా పట్టుకుందో చూస్తే.. నొరెళ్లబెట్టాల్సిందే..

అయితే తీరా మంటపం వద్దకు రాగానే మంటలను భరించడం వారి వల్ల కాలేదు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న నిపుణులు.. ఫైర్ సిలిండర్లతో వెంటనే మంటలను ఆర్పేస్తారు. వివాహ ఘట్టం వినూత్నంగా ఉండేందుకు ఇలాంటి నిపుణుల సమక్షంలో ఇలాంటి స్టంట్‌కు సిద్ధమయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేం ప్రయోగం రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మెషీన్స్ అక్కర్లేదట.. ఒట్టి చేతులే చాలట.. ఈ పెద్దాయన టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Updated Date - 2023-09-23T15:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising