Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

ABN, First Publish Date - 2023-04-01T15:31:10+05:30

వివాహ కార్యక్రమాల్లో కొందరు వింత వింత పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి కార్యక్రమం మొత్తం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అందరిలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ చివరకు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారుతుంటారు. వివాహానికి..

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహ కార్యక్రమాల్లో కొందరు వింత వింత పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి కార్యక్రమం మొత్తం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అందరిలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ చివరకు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారుతుంటారు. వివాహానికి సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వధూవరులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఫోజులు పెట్టడమే వారి కొంపముంచింది. సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా చోటు చేసుకున్న ఘటనతో అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral videos) మారింది. ఓ పెళ్లి వేడకలో వధూవరులు (bride and groom) సాంప్రదాయ వస్త్రధారణలో ఫొటోలకు ఫోజులిస్తుంటారు. పూలదండలు వేసుకున్న వధూవరులు.. కేక్ ఎదురుగా నిలబడి ఉంటారు. కెమెరామెన్ (Cameraman) సూచలను పాటిస్తూ వివిధ రకాలుగా ఫోజులు ఇస్తుంటారు. ఈ క్రమంలో వారిద్దరికీ స్పార్కిల్ గన్ (Sparkle gun) ఇస్తారు. వధూవరులు ఇద్దరూ గన్ పట్టుకుని జేమ్స్‌ బాండ్ తరహాలో కెమెరాకు ఫోజులు ఇస్తూ ఉంటారు. గన్ ట్రిగ్గర్ నొక్కగానే అందులోంచి మెరుపులు విరజిమ్ముతాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: వంటింట్లో సడన్‌గా మంటలు రాగానే ఈ భర్త చేసిన పనికి భార్యలో కట్టలు తెంచుకున్న కోపం.. చెప్పు తీసుకుని మరీ..

గన్ పట్టుకుని ఉన్న వధువు నవ్వుతూ కెమెరాలకు ఫోజు ఇస్తూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా గన్ వెనుక భాగం నుంచి ఫట్‌మని శబ్ధంతో పెద్ద మంట (Big fire) బయటికి వస్తుంది. మొఖానికి తగలడంతో ఆమె ఒక్కసారిగా విలవిల్లాడిపోతుంది. ఈ ఘటనతో అంతా షాక్ అవుతారు. పరుగు పరుగున వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రమాదంలో వధువుకు స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని సలహాలు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..


kurnool: వామ్మో.. కర్నూల్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!

********************************

Janhvi Kapoor: మాల్దీవుల్లో ఎన్టీఆర్ హీరోయిన్ చిల్.. బికినీ ఫొటోల‌తో హ‌ల్ చ‌ల్‌

Updated Date - 2023-04-02T10:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising