Viral Video: ఇలాంటి డ్రెస్‌తో డాన్స్ ఎలా సాధ్యమంటూ వధువును అభినందించిన వరుడు.. విషయం తెలుసుకుని అవాక్కయిన అతిథులు..
ABN, First Publish Date - 2023-06-20T21:41:55+05:30
అందరూ చేసే పనులే అయినా.. అందులోనే కొందరు తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. తాము ఏం చేసినా మిగతా వారికి భిన్నంగా ఉండాలని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటుంటారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రధానంగా వివాహాల విషయంలో వధూవరులు ఇటీవల..
అందరూ చేసే పనులే అయినా.. అందులోనే కొందరు తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. తాము ఏం చేసినా మిగతా వారికి భిన్నంగా ఉండాలని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటుంటారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రధానంగా వివాహాల విషయంలో వధూవరులు ఇటీవల చిత్రచిత్రంగా ఆలోచిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతున్నారు. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వధువు వేసిన డాన్స్ గురించి.. ఎలా సాధ్యం అంటూ వరుడు అభినందంచాడు. చివరకు అసలు విషయం తెలుసుకుని అతిథులంతా అవాక్కయ్యారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. వివాహ వేడుకలో (wedding ceremony) వధువు ఏమాత్రం బిడియ పడకుండా డాన్స్ చేయడమే కాకుండా వరుడితో పాటూ అతిథులందరినీ ఆశ్చర్యపరచింది. అందమైన వస్త్రధారణలో ఇద్దరు స్నేహితులతో కలిసి స్టేజి పైకి వచ్చిన వధువు (bride) .. ‘‘సామీ సామీ’’ హిందీ పాటకు డాన్స్ (Dance) చేస్తుంది. అందమంది అతిథులు ఉన్నా ఏమాత్రం బిడియపడకుండా అదిరిపోయే స్టెప్పులతో అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆమె ధరించిన లెహంగా గురించి తెసుకుని అంతా అవాక్కయ్యారు.
Viral news: వామ్మో! ఒక్క నిముషం ఆలస్యం అయ్యున్నా.. బేకరీలో ఇతడు చేసిన నిర్వాకం బయటపడి ఉండేది కాదు..
సుమారు 9కేజీల బరువున్న లెహంగా (9 kg lehenga) ధరించిన వధువు నడవడమే కష్టం అనుకుంటే ఏకంగా డాన్సులే వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విషయం తెలుసుకున్న వరుడు వావ్! సూపర్.. అంటూ చప్పట్లతో అభినందిస్తాడు. అతిథులంతా ఈలలు, కేలలతో వధువును మరింత ఎంకరేజ్ చేస్తారు. బరువైన లెహంగా ధరించినా కూడా.. వేగంతో పాటీ ఈజీగా డాన్స్ వేయడం చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ‘‘ఈ వధువు ఎంత బాగా డాన్స్ చేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈమె ఎక్స్‌ఫ్రెషన్స్ సింప్లీ సూపర్’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-06-20T21:41:55+05:30 IST