Viral Video: పులి వెనకే కూర్చుని సెల్ఫీకి ఫోజులిస్తున్న ఈ ఇద్దరు స్నేహితులకు.. చివరకు ఎమైందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-05-16T18:55:43+05:30
పులితో ఫొటో దిగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చూడగానే ఎక్కడ చంపేస్తుందో అనే భయంతో కలలో కూడా ఆ సాహసం చేయరు. అయితే కొన్ని జూలలో మాత్రం ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పులులు, సింహాలతో చాలా మంది ఫొటోలు దిగడం చూస్తూ ఉంటాం. అయినా ఇలాంటి సందర్భాల్లో..
పులితో ఫొటో దిగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చూడగానే ఎక్కడ చంపేస్తుందో అనే భయంతో కలలో కూడా ఆ సాహసం చేయరు. అయితే కొన్ని జూలలో మాత్రం ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పులులు, సింహాలతో చాలా మంది ఫొటోలు దిగడం చూస్తూ ఉంటాం. అయినా ఇలాంటి సందర్భాల్లో కూడా కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు ఓ పులి వెనుక కూర్చుని ఫొటోలు దిగుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో పులికి ఒక్కసారిగా కోపం రావడంతో ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో పులికి సంబంధించిన ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు స్నేహితులు ఓ జూలో ఎన్‌క్లోజర్‍లో గొలుసుతో కట్టేసి ఉన్న పులి (tiger) వద్దకు వెళ్తారు. పక్కనే ఓ ట్రైనర్.. పులిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దీంతో స్నేహితులు పులి వెనుక కూర్చుని ఫొటోలకు (Friends taking pictures with the tiger) ఫోజులు ఇస్తూ ఉంటారు. మధ్య మధ్యలో పులి పైకి లేవకుండా పక్కనే ఉన్న ట్రైనర్ ఓ కర్రతో పులి తలపై కొడుతూ ఉంటాడు. ఇలా రెండు మూడు సార్లు కొట్టగానే పులికి కోపం (Angry Tiger) వస్తుంది. చివరకు ‘‘ఎహే! ఫొటోలు దిగుతుంటే నీ గోల ఏంటీ’’.. అన్నట్లుగా ట్రైనర్ వైపు చూస్తూ పెద్ద శబ్ధంతో గాండ్రిస్తుంది.
దీంతో అప్పటిదాకా పులి వెనుక నవ్వుతూ ఉన్న స్నేహితులిద్దరూ ‘‘చచ్చామ్రా.. బాబోయ్’’.. అనుకుంటూ ఒకరిమీద మరొకరు పడుకుంటూ పరుగు పరుగున బయటికి వెళ్లిపోతారు. ‘‘వీళ్లను ఏమీ అనకున్నా ఎందకిలా పారిపోతున్నారబ్బా’’.. అన్నట్లుగా పులి వారి వైపు చూస్తుంది. బయటికి వెళ్లిన వారిలో ఓ వ్యక్తి నేలపై చేతులు పెట్టి తన ఇష్ట దైవాన్ని తలచుకుంటాడు. ‘‘ఈ ఫొటోలు వద్దు ఏమీ వద్దురా నాయనా.. కొంచెం ఉండుంటే చచ్చేవాళ్లం’’.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-05-16T18:55:43+05:30 IST