ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లికి ముందే ప్రమాదానికి గురైన భార్యపై.. వివాహ వేదికపై ఈ భర్త చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా..

ABN, First Publish Date - 2023-04-26T20:54:28+05:30

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!! అంటూ వివాహ సమయంలో వరుడు ప్రమాణం చేస్తాడు. కష్టసుఖాలు, సుఖదుఃఖాల్లోనూ నీకు తోడుగా ఉంటానంటూ భర్త హామీ ఇవ్వడం.. దీని అర్థం. ఈ ప్రమాణాన్ని పక్కన పెట్టి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!! అంటూ వివాహ సమయంలో వరుడు ప్రమాణం చేస్తాడు. కష్టసుఖాలు, సుఖదుఃఖాల్లోనూ నీకు తోడుగా ఉంటానంటూ భర్త హామీ ఇవ్వడం.. దీని అర్థం. ఈ ప్రమాణాన్ని పక్కన పెట్టి భార్యను చిత్రహింసలకు గురి చేసేవారు చాలా మంది ఉంటారు. అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి.. భార్యను కంటికి రెప్పలా చూసుకునే భర్తలు కూడా ఎంతో మంది ఉంటారు. తాజాగా, ఓ వరుడు చేసిన పని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెళ్లికి ముందే ప్రమాదానికి గురైన భార్యపై అతడు చూపిన ప్రేమ.. అందరినీ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. వారిద్దరూ ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు. ఇటీవలే నిశ్చితార్థం (Engagement) కూడా చేసుకున్నారు. అయితే అనంతరం యువతి (young woman) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పెళ్లిళ్ల సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. అవి చాలా ప్రభావం చూపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. పైగా వీరిద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగిపోయింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ భార్యకు (wife) రక్తదానం చేయడంతో పాటూ దగ్గరుండి సపర్యలు చేశాడు.

Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత అనుకున్నట్లే వివాహ (marriage) ఏర్పాట్లు చేసుకున్నారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న భార్యను ఎత్తుకుని మరీ వివాహ వేదికపైకి వెళ్లాడు. అనంతరం భార్యను ఎత్తుకునే ఏడు అడుగులు కూడా వేశాడు. భార్యపై భర్తకు ఎలాంటి ప్రేమ ఉండాలో ప్రత్యక్షంగా చూపించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడీ వరుడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని అభినందలతో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇలాంటి భర్త ఉంటే ఏ భార్యకూ ఇబ్బందులు ఉండవు’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Vdeo: ఈ ఎలుగుబంటి ఏకాగ్రతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

Updated Date - 2023-04-28T21:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising