Marriage Video: కారులో రావాల్సిన వరుడిని సడన్‌గా ఇలా చూసి అవాక్కైన బంధువులు.. పెళ్లికి ముందే ముచ్చట తీర్చుకున్నాడుగా..!
ABN, First Publish Date - 2023-11-14T19:38:19+05:30
ప్రస్తుతం జరుగుతున్న వివాహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరిని మించి మరొకరు తమ వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరు వధూవరులకైతే ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. వివాహ మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి...
ప్రస్తుతం జరుగుతున్న వివాహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరిని మించి మరొకరు తమ వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరు వధూవరులకైతే ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. వివాహ మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి అన్ని ఘట్టాలను ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటుంటారు. ఇలాంటి వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మంటపంలోకి వినూత్న రీతిలో ఎంట్రీ ఇచ్చిన వరుడి వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘పెళ్లికి ముందే ముచ్చట తీర్చుకున్నాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కళ్యాణ మంటంపంలో వివాహ కార్యక్రమానికి (wedding ceremony) సంబంధించిన ఏర్పాట్లు చేశారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులంతా అక్కడికి చేరుకున్నారు. వధువు (bride) తరపు బంధువులు కూడా చేరుకున్నారు. అంతా కలిసి వరుడి రాక కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇంతలో వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వరుడు వివాహ మంటపం వద్దకు ఎంటరయ్యాడు. గుర్రం మీదనో లేదా ఏదైనా వాహనం మీద వస్తాడని అంతా అనుకుంటే.. అతను మాత్రం అందుకు (groom entered wedding hall on toy horse) పూర్తి విరుద్ధంగా గుర్రపు బొమ్మపై వచ్చాడు.
బ్యాటరీతో తయారు చేసిన గుర్రం బొమ్మపై పిల్లాడిలా కూర్చున్న వరుడు.. దాన్ని సంతోషంగా నడుపుతూ వస్తాడు. పక్కనే కొందరు అతడికి గొడుగు పట్టుకోగా.. మరికొందరు రంగులు చల్లుతూ, పటాసులు పేల్చుతూ మంటపం వద్దకు చేరుకుంటారు. లోపలికి రాగానే అదే గుర్రం బొమ్మపై అచ్చం చిన్న పిల్లల తరహాలో కొన్ని రౌండ్లు కొడతాడు. ఆ సమయంలో అతను ఎంతో సంతోషంగా కనిపిస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిన్నతనంలో గుర్రం బొమ్మపై కూర్చోలేదేమో’’.. అని కొందరు, ‘‘చిన్న నాటి కోరికను పెళ్లి రోజు తీర్చుకున్న వరుడు’’.. అని మరికొందరు, ‘‘ఇతను పెళ్లికొడుకా.. లేక చిన్నపిల్లాడా’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 80 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-11-15T16:59:37+05:30 IST