ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇతడేం పెళ్లికొడుకు బాబోయ్.. వధువు అంత కష్టపడి డాన్స్ చేస్తోంటే ఇతడు చేసిన నిర్వాకమేంటో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-05-24T21:38:11+05:30

సోషల్ మీడియా ప్రభావంతో ఇటీవల వివాహ కార్యక్రమాల్లోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. వివాహ తంతు మొదలైనప్పటి నుంచి ప్రతి ఘటననూ వీడియో తీసి ఆన్‌లైన్‌లోకి వదులుతుంటారు. వీటిలో కాస్త వినూత్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రధానంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా ప్రభావంతో ఇటీవల వివాహ కార్యక్రమాల్లోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. వివాహ తంతు మొదలైనప్పటి నుంచి ప్రతి ఘటననూ వీడియో తీసి ఆన్‌లైన్‌లోకి వదులుతుంటారు. వీటిలో కాస్త వినూత్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రధానంగా వధువుకు సంబంధించిన డాన్స్ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. వధువు కష్టపడి డాన్స్ చేస్తుంటే.. పక్కన వరుడి నిర్వాకం చూసి అంతా.. ‘‘ఇతడేం పెళ్లికొడుకు’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. వివాహ వేదికపై వధూవరులు (bride and groom) దండలు మార్చుకుంటూ ఉంటారు. అతిథులంతా ఆసక్తిగా తిలకిస్తూ ఉండగా.. సడన్‌గా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వరుడు దండ వేయగానే వధువుకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. వెంటనే ఉత్సాహంతో డాన్స్ (Bride dance) వేస్తూ వరుడిని ఎంకరేజ్ చేస్తుంది. అయితే వరుడు మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా పక్కనే కూర్చుని ఎటో చూస్తూ ఉంటాడు. వధువు అంత కష్టపడి డాన్స్ చేస్తున్నా కన్నెత్తి కూడా చూడకుండా.. తనకు ఇష్టం లేనట్లు వ్యవహరిస్తాడు. పక్కన ఉన్న వాళ్లు ఎంత చెప్పినా అలాగే కూర్చుండిపోతాడు.

Marriage: పాపం.. ఈ కుర్రాడికి పెళ్లయిందన్న సంతోషమే లేకుండా పోయింది కదా.. మామూలు రోజుల్లో అయితే ఎగిరిగంతేసేవాడే కానీ..!

వధువు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా డాన్సు వేస్తూనే ఉంటుంది. చివరకు అక్కడే ఉన్న ఓ మహిళ కలుగజేసుకుని వరుడి వద్దకు వెళ్తుంది. ‘‘ఆ అమ్మాయి అంత బాగా డాన్సు చేస్తుంటే.. పట్టించుకోవేంటీ’’.. అంటూ చేయి పట్టుకుని పైకి లేపుతుంది. దీంతో ఎట్టకేలకు వరుడు.. వధువు పక్క నిల్చుంటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ వధువు ఎంత బాగా డాన్స్ చేస్తోంది’’.. అని కొందరు, ‘‘వీడెక్కడి వరుడండీ బాబూ’’.. అని మరికొందరు, ‘‘ఇతడికి కొంచెం కూడా అభిమానం లేనట్లుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

Updated Date - 2023-05-24T21:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising