Viral Video: ఒరే ఆగండ్రా బాబూ.. ప్రశాంతంగా పెళ్లి చేస్కోనివ్వండంటూ ఫ్రెండ్స్‌పై వరుడి చిరాకు.. ఈ వీడియోను చూస్తే నవ్వాగదు..!
ABN, First Publish Date - 2023-02-18T16:32:46+05:30
ఇటీవల సోషల్ మీడియాలో వధూవరులకు సంబంధించిన వీడియోలు.. ఇలా షేర్ చేయగానే, అలా వైరల్ అయిపోతున్నాయి. వివాహ కార్యక్రమాల్లో ఏ వింత ఘటన చోటు చేసుకున్నా ఇట్టే..
ఇటీవల సోషల్ మీడియాలో వధూవరులకు సంబంధించిన వీడియోలు.. ఇలా షేర్ చేయగానే, అలా వైరల్ అయిపోతున్నాయి. వివాహ కార్యక్రమాల్లో (Wedding events) ఏ వింత ఘటన చోటు చేసుకున్నా ఇట్టే నెట్టింట దర్శనమిస్తోంది. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను తెగ లైక్ చేసేస్తుంటారు. ప్రస్తుతం ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వివాహ వేడుకలో వధూవరులు (bride and groom) దండలు మార్చుకుంటూ ఉండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. దీంతో.. వరుడు స్పందిస్తూ.. ఓరే ఆగండ్రా బాబూ.. ప్రశాతంగా పెళ్లి చేస్కోనివ్వండ్రా... అని చిరాకుపడతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి తెగ వైరల్ (Viral videos) అవుతోంది. పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితుల సమక్షంలో వధూవరులు దండలు మార్చుకుంటూ ఉంటారు. వధువు మెడలో దండ వేసిన వరుడు.. ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఉంటాడు. ఇంతలో వరుడి స్నేహితులు.. కాగితాలు వెదజల్లే పటాకులు (firecrackers) పేల్చుతారు. దీంతో ఒక్కసారిగా ఫట్ మని పెద్ద శబ్ధం వస్తుంది. అప్పటిదాకా ఫొటోలకు ఫోజులు ఇస్తున్న వరుడు.. పటాకుల శబ్ధం వినగానే.. వామ్మో! చచ్చాన్రో.. దేవుడో.. అనుకుంటూ భయపడిపోయి కిందకు వంగుతాడు.
కాసేపటికి తేరుకుని స్నేహితులపై (groom is angry) ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ‘‘ఒరేయ్.. మీ ఆత్రం తగలెయ్య.. చంపేస్తారా ఏంటీ.. కాసేపు ఆగండ్రా.. ప్రశాంతంగా పెళ్లి చేసుకోనివ్వండి’’.. అంటూ విసుక్కుంటాడు. పటాకుల శబ్ధానికి వధువు ఏమాత్రం చలింకపోవడం, వరుడు మాత్రం భయపడిపోవడంతో.. అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. ఆ సమయంలో వరుడి మొఖం ఒక్కసారిగా వాడిపోవడం గమనించవచ్చు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-02-18T16:35:02+05:30 IST