ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లివేడుకలో మైమరచిపోయి డాన్స్ చేస్తున్న భార్యాభర్తలు.. వరుడి స్థానంలో ఉన్న వారి కొడుకు రియాక్షన్ చూస్తే..

ABN, First Publish Date - 2023-02-21T15:28:56+05:30

వివాహ కార్యక్రమాల్లో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా అంతా చిన్నపిల్లల తరహాలో ఎంజాయ్ చేస్తుంటారు. కొందరైతే చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ప్రధానంగా డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ వేడుకను మరింత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహ కార్యక్రమాల్లో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా అంతా చిన్నపిల్లల తరహాలో ఎంజాయ్ చేస్తుంటారు. కొందరైతే చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ప్రధానంగా డీజే పాటలకు (DJ songs) డ్యాన్సులు చేస్తూ వేడుకను మరింత ఉల్లాసభరితంగా మార్చుతుంటారు. పెళ్లిళ్లకు సంబంధించిన వివిధ ఘట్టాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో (Dance videos) ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకలో భార్యాభర్తలు మైమరచిపోయి డాన్సు చేస్తుంటారు. దీంతో వరుడి స్థానంలో ఉన్న వారి కొడుకు రియాక్షన్ ఏంటంటే..

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించి వీడియో (Wedding viral videos) తెగ సందడి చేస్తోంది. ఓ వివాహ వేడకలో డీజే పాటలకు అంతా డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో వరుడి తల్లిదండ్రులు కూడా స్టేజి పైకి వెళ్తారు. 'సారే జగ్ సే నిపత్ లూన్ అకేలీ...' అనే హిందీ పాటకు (Hindi songs) లయబద్ధంగా కాలు కదుపుతారు. డాన్స్ వేశాం అంటే వేశాం.. అన్నట్లు కాకుండా పూర్తి మనను పెట్టి, మైమరిచి పోయి డాన్స్ చేస్తుంటారు. దీంతో అక్కడున్న అతిథులంతా ఈలలు, చప్పట్లతో వారిని మరింత ఎంకరేజ్ చేస్తుంటారు. ఆ సమయంలో అక్కడే వరుడి (groom) స్థానంలో ఉన్న వారి కొడుకు.. తల్లిదండ్రులు వేయడాన్ని ఆసక్తిగా చూస్తుంటాడు. ముందులో కాస్త సిగ్గు పడినట్లు అనిపించినా.. చివరకు తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఈ వీడియో జనవరి 19న షేర్ చేయగా.. ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: పెళ్లిలో డాన్స్ చేస్తూనే పగ తీర్చుకున్న యువకుడు.. నవ్వుతూ నవ్వుతూనే చివరకు ఎంత పని చేశాడంటే భయ్యా..

Updated Date - 2023-02-21T15:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising