Viral Video: పెళ్లిలో డాన్స్ వేస్తూ కింద పడ్డాడని అంతా నవ్వుతోంటే.. ఆ పిల్లాడి తల్లి నుంచి ఊహించని రియాక్షన్..!
ABN, First Publish Date - 2023-02-16T18:03:08+05:30
పిల్లలు తెలిసీ తెలీని వయసులో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చేసే విచిత్రమైన పనులను చూసి తల్లి ఎంతో మురిసిపోతుంది. తమ పిల్లలను ఎవరైనా ఎగతాళి చేస్తే.. అసలు సహించలేరు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి.. మరింతగా ప్రోత్సహిస్తుంటారు. చిన్న పిల్లలకు సంబంధించిన ...
పిల్లలు తెలిసీ తెలీని వయసులో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చేసే విచిత్రమైన పనులను చూసి తల్లి ఎంతో మురిసిపోతుంది. తమ పిల్లలను ఎవరైనా ఎగతాళి చేస్తే.. అసలు సహించలేరు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి.. మరింతగా ప్రోత్సహిస్తుంటారు. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ పిల్లాడు వివాహ వేడకలో ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ పొరపాటున కిందపడిపోతాడు. దీంతో అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంటారు. అక్కడే ఉన్న పిల్లాడి తల్లి మరుక్షణం ఏం చేసిందంటే.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. వివాహ వేడుకలో ఓ బుడ్డోడు డ్యాన్స్ వేయడానికి సిద్ధమవుతాడు. బాలీవుడ్ హీరో గోవిందా (Bollywood hero Govinda) హిట్ సాంగ్ అయిన.. ‘‘దిల్ బెహల్తా హై మేరా, ఆప్కే ఆ జానే’’.. అనే పాటను ప్లే చేస్తారు. ఈ పాటకు పిల్లాడు కూడా ఎంతో ఉత్సాహంగా లయబద్ధంగా డ్యాన్స్ చేస్తుంటాడు. ఇతడి డ్యాన్స్ చూసి అంతా చప్పట్లు కొడుతుంటారు. ఇంతలో బాలుడు వెనక్కు వెళ్తూ వెళ్తూ.. పొరపాటున కాలు జారి కిందపడిపోతాడు. దీంతో అక్కడున్ వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంటారు.
దీన్ని గమనించిన బాలుడి తల్లి వెంటనే కొడుకును పైకి లేపి, డ్యాన్స్ చేయమంటూ ప్రోత్సహిస్తుంది. తర్వాత పిల్లాడు మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తాడు. మధ్యలో బాలుడి తల్లి కూడా కాలు కదుపుతుంది. కొడుకుతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ (Expressions) చూసి అంతా చప్పట్లతో మారుమోగిస్తారు. ఈ వీడియో (Dance videos) ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. వావ్! తల్లీకొడుకుల డ్యాన్స్ (Mother and son dance) .. చూడముచ్చటగా ఉంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-02-16T18:03:15+05:30 IST