World's longest Python: అమ్మ బాబోయ్.. ఇదేంటి ఇంత పొడవుంది..? నేరుగా ఇంట్లోకి దూరిన కొండచిలువ..!
ABN, First Publish Date - 2023-03-28T18:45:26+05:30
పొడవైన కొండచిలువలను కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. నీటిలోంచి ఒక్కసారిగా అంతెత్తున పైకి లేచి, పెద్ద పెద్ద పడవలను సైతం ఎత్తి పడేస్తుంటాయి. అయితే నిజ జీవితంలో ఇలాంటి కొండచిలువలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం..
పొడవైన కొండచిలువలను కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. నీటిలోంచి ఒక్కసారిగా అంతెత్తున పైకి లేచి, పెద్ద పెద్ద పడవలను సైతం ఎత్తి పడేస్తుంటాయి. అయితే నిజ జీవితంలో ఇలాంటి కొండచిలువలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి అరుదైన కొండచిలువలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అత్యంత పొడవైన కొండచిలువ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంట్లోకి దూసుకుపోతున్న కొండచిలువను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువ రకాల్లో ఒకటైన రెటిక్యులేటెడ్ (Reticulated python) కొండచిలువ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది. ఓ ఇంటి వరండాలోకి చొరబడుతుండగా కొందరు తమ కెమెరాల్లో (Cameras) బంధించారు. ఇంటి కాంపౌండ్ పైకి ఎక్కి లోపలికి వెళ్తోంది. చాలా పొడవు, లావుతో ఉన్న ఈ పామును చూసి అంతా షాక్ అవుతున్నారు. రెటిక్యులేటెడ్ పైథాన్ అనే ఈ కొండచిలువ దక్షిణ, ఆగ్నేయాసియాకు (South and Southeast Asia) చెందిన పైథాన్ జాతి.
ప్రపంచంలోని భారీ, పొడవైన పాముల్లో (Longest snakes in the world) ఇవీ ఒకటి. ఈ రకం కొండచిలువలు 16 అడుగుల కంటే ఎక్కువ పెరుగుతాయట. కాగా, ఈ భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింటతెగ (Viral videos) చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో! ఇంత పెద్ద పామును ఎక్కడా చూల్లేదు.. అని కొందరు, హమ్మయ్య! మా ఇంట్లోకి అయితే రాలేదు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-03-28T18:45:26+05:30 IST