ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: ఈమె భర్త ఎంత అదృష్టవంతుడో.. అతడిని ఎంతగా ప్రేమిస్తే ఈ భార్య ఇలా చేస్తుందో మీరే ఊహించండి..?

ABN, First Publish Date - 2023-05-20T15:21:20+05:30

భార్యాభర్తలు అన్నాక ఒకరినొకరు సంతోషపెట్టుకోవడం సహజం. అంతేకాకుండా రకరకాలైన బహుమతులు ఇచ్చుకోవడం.. షికార్లు చేయడం ఇవన్నీ సహజమే. ఇంకొంత మంది తమ ప్రేమను వివిధ రూపాల్లో

Wife
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తలు అన్నాక ఒకరినొకరు సంతోషపెట్టుకోవడం సహజం. అంతేకాకుండా రకరకాలైన బహుమతులు ఇచ్చుకోవడం.. షికార్లు చేయడం ఇవన్నీ సహజమే. ఇంకొంత మంది తమ ప్రేమను వివిధ రూపాల్లో ప్రదర్శిస్తుంటారు. అది వారి వారి స్థాయిను బట్టి ఉంటుంది. అలాగే ఓ మహిళ కూడా తన భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒక అనూహ్య మైన నిర్ణయం తీసుకుంది. ఒక ఉపాయం ఆలోచించి నుదుటపై అలా చేయించుకోవాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఆమె పడిన పాట్లు మామోలుగా లేవు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెటింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయమేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

బెంగళూరు (Bangalore)కు చెందిన ఓ మహిళ తన భర్తను (husbands name) మెప్పించేందుకు విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. ఆమె నుదుటిపై తన భర్త పేరును (woman tattoo) రాయించుకోవాలని అనుకుంది. ముందుగా టాటూ ఆర్టిస్ట్‌కు సతీష్ అని తన పేరు తెలియజేసింది. పేపర్‌పై రాసి మహిళ నుదుటిపై అతికించి ఫాంట్ సైజును ఖరారు చేశారు. ఆ తర్వాత కార్బన్ పేపర్ మహిళ నుదిటిపై ప్రింట్ చేశారు. అప్పటివరకూ ఆమె చాలా సంతోషంగా కనిపించింది. ఎప్పుడైతే నుదిటిపై సూదితో రాయడం మొదలు పెట్టాడో ఆ వెనువెంటనే నొప్పి భరించలేక విలవిలలాడి పోయింది. నొప్పి భరించలేక ఆమె టాటూ ఆర్టిస్టును వెనక్కి నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral) అవుతోంది.

బెంగళూరుకు చెందిన టాటూ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో king maker tattoo studio పేరుతో ఉన్న పేజీలో ఈ వీడియోను షేర్ చేశాడు. ఇందులో చాలా రకాల టాటూ డిజైన్లు కనిపించాయి. ఈ వీడియో యొక్క క్యాప్షన్‌లో తుది ఫలితం మరొక వీడియోలో చూపబడుతుంది అని వ్రాయబడింది. కానీ దీనికి సంబంధించిన ఇతర ఏ వీడియో ఈ పేజీలోనూ అప్‌లోడ్ చేయబడలేదు. టాటూ వేయించుకోవాలనే ఆలోచనను ఆ మహిళ విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Wife Swapping: ఇప్పుడిదే కొత్త ట్రెండ్ అంటూ భర్త వికృత చేష్టలు.. భరించలేక కేసు పెట్టిన 26 ఏళ్ల భార్య.. 5 నెలల తర్వాత ఇంట్లో..!

Updated Date - 2023-05-20T15:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising