ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు.. ఇతన్ని ఎలా కాపాడాలో మీరైనా చెప్పగలరా..

ABN, First Publish Date - 2023-05-06T21:46:36+05:30

కొన్నిసార్లు ఏదో చేయాలని వెళ్తే.. చివరికి ఇంకేదో అవుతుంటుంది. ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయారు.. అని ఇలాంటి సందర్భాల్లోనే అంటూ ఉంటారు. కొందరు అందరి ముందూ ఫేమస్ అయ్యేందుకు పాములు, కోతులు, ఏనుగులు తదితర జంతువులతో పెట్టుకుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు ఏదో చేయాలని వెళ్తే.. చివరికి ఇంకేదో అవుతుంటుంది. ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయారు.. అని ఇలాంటి సందర్భాల్లోనే అంటూ ఉంటారు. కొందరు అందరి ముందూ ఫేమస్ అయ్యేందుకు పాములు, కోతులు, ఏనుగులు తదితర జంతువులతో పెట్టుకుని చివరకు ప్రాణం మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు అనుకోకుండా జంతువుల బారిన పడి గాయాలపాలవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఎద్దుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎద్దును బంధించాలని వెళ్లిన ఓ వ్యక్తి.. చివరకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఎద్దుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Bull viral videos) అవుతోంది. జాతర సందర్భంగా చాలా మంది హడావుడిగా ఉంటారు. అక్కడే చాలా వాహనాలు పార్క్ చేసి ఉంటాయి. అక్కడికి చాలా ఎద్దులు కూడా తీసుకుని వచ్చారు. అయితే ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వాటిలో ఓ ఎద్దు ఉన్నట్టుండి జనం మీదకు దాడి (Bull attack on people) చేసేందుకు ప్రయత్నిస్తుంది. అటూ ఇటూ తిరుగుతూ అడ్డొచ్చిన వారిని మీదకు కోపంతో వెళ్తుండడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంటుంది. దాన్ని బంధించేందుకు అంతా శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇందు కోసం ఎద్దు మెడకు తాళ్లు వేసి పట్టుకోవాలని చూస్తారు. అయినా వారికి సాధ్యం కాదు.

Groom: పెళ్లి మండపంలో షాకింగ్ సీన్.. రానని అంటున్నా.. బలవంతంగా వరుడిని ఎత్తుకెళ్లిన బంధువులు.. అసలేం జరిగిందంటే..!

చివరకు ఓ వ్యక్తి తాడు ఎద్దు మెడకు వేసి స్తంభానికి కట్టేస్తాడు. అయితే అదే సమయంలో ఎద్దు తన మీదకు రావడంతో భయంతో విద్యుత్ స్తంభం పైకి (young man climbed electric pole) ఎక్కేస్తాడు. తాడు కట్టి ఉండడంతో ఎద్దు ఎటూ వెళ్లడానికి వీలు లేక.. స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీంతో కిందకు దిగితే ఎక్కడ కొమ్ములతో పొడుస్తుందో అనే ఉద్దేశంతో అతను కిందకు దిగేందుకు సాహసం చేయడు. అలాగని స్తంభాన్ని పట్టుకుని ఉండలేక ఇబ్బంది పడతాడు. పక్కన ఉన్న వారు కాపాడాలని చూసినా.. ఎద్దు దెబ్బకు భయపడి దూరంగా ఉండిపోతారు. అంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Groom: అసలు నిజం తెలిసి వరుడిని వదిలేసి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వధువు.. పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

Updated Date - 2023-05-06T21:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising