Viral Video: ఎందుకొచ్చిన పెళ్లిరా అంటూ తల పట్టుకున్న వధూవరులు... భోజన సమయంలో యువకుల నిర్వాకంతో..
ABN, First Publish Date - 2023-07-16T15:15:13+05:30
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివాహ కార్యక్రమాల్లో కొందరు కావాలనే వింత వింత విన్యాసాలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఎవరూ ప్లాన్ చేయకున్నా.. ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు.. చిన్న చిన్న సమస్యలు చివరకు..
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివాహ కార్యక్రమాల్లో కొందరు కావాలనే వింత వింత విన్యాసాలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఎవరూ ప్లాన్ చేయకున్నా.. ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు.. చిన్న చిన్న సమస్యలు చివరకు పెద్ద గొడవగా మారి, పెళ్లి రద్దు చేసుకునే వరకూ వెళ్తుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమంలో (Wedding procession) ఊరేగింపు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్యక్రమం మొత్తాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. వధూవరులు (bride and groom) సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరుల తరపు స్నేహితులంతా డాన్సులు చేస్తూ (Young people dance) సందడిగా గడిపారు. కాసేపటికి భోజన సమయం రానే వచ్చింది. దీంతో యువకులంతా భోజన శాల వద్దకు వెళ్లారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. వారు వెళ్లే సరికి భోజనం మొత్తం అయిపోయింది. దీంతో ఒక్కసారిగా కోపం (Angry) కట్టలు తెంచుకుంది. ‘‘ఇంత ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేశారు.. కనీసం అందరికీ భోజనం పెట్టాలని తెలీదా’’... అంటూ రచ్చ రచ్చ చేశారు.
Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..
ఈ క్రమంలో కొందరు ఓ అడుగు ముందుకేసి.. అక్కడున్న ఖాళీ ప్లేట్లు, పాత్రలు, కుర్చీలు తీసుకుని డాన్సులు వేస్తూ నేలకు విసిరికొట్టారు. వీరి అల్లరికి పెళ్లికి వచ్చిన బంధువులంతా షాక్ అయ్యారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో భోజనాల విషయంలో ఇలా జరిగేసరికి వధూవరులు తల పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లిళ్లలో ఎక్కువగా భోజనాల వద్దే గొడవ జరుగుతుంటుంది’’.. అని కొందరు, ‘‘భోజనం లేదని మరీ ఇలా చేయడం పద్ధతి కాదు’’.. అని మరికొందరు, ‘‘పెళ్లిళ్లలో ఇలాంటివి సర్వసాధారణం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-16T15:15:13+05:30 IST