ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కారుకు పెట్రోల్ పట్టేందుకు తెగ శ్రమించింది.. చివరకు యజమాని చెప్పింది విని నాలుక్కరుచుకున్న యువతి..

ABN, First Publish Date - 2023-05-07T15:36:27+05:30

కొందరు తెలిసీ తెలియక చేసే పనులు.. పక్క వారికి ఎక్కడ లేని కోపం తెప్పిస్తుంటాయి. అలాగే మరికొన్ని సార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొందరు అమాయకులను టార్గెట్ చేసి, ప్రాంక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వీడియోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు తెలిసీ తెలియక చేసే పనులు.. పక్క వారికి ఎక్కడ లేని కోపం తెప్పిస్తుంటాయి. అలాగే మరికొన్ని సార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొందరు అమాయకులను టార్గెట్ చేసి, ప్రాంక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు యువతి కారుకు పెట్రోల్ పట్టేందుకు తెగ శ్రమించింది. చివరకు కారు యజమాని చెప్పంది విని నాలుక్కరుచుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ పెట్రోల్ బంక్ వద్ద కార్లు వరసుగా క్యూలో ఉంటాయి. ఓ యువతి (young woman) వాహనాలకు పెట్రోల్ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ టెస్లా కారు (Tesla car) వచ్చి ఆగుతుంది. పక్కన ఉన్న యువతి నేరుగా అక్కడికి వచ్చి పంపు తీసుకుని వాహనానికి పెట్రోల్ (Petrol) పట్టాలని చూస్తుంది. అయితే పెట్రోల్ ట్యాంక్ ఎక్కడుందో తెలీక.. వెనుక, ముందూ వెతుకుతూ ఉంటుంది. ఇదేంటీ.. ఈ కారుకు పెట్రోల్ ఎలా పట్టాలి.. అనుకుంటూ చాలా సార్లు కారు చుట్టూనే తిరుగుతుంది.

Groom: అసలు నిజం తెలిసి వరుడిని వదిలేసి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వధువు.. పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

యువతిని చూసి పక్కన ఉన్న వాహనదారులు (Motorists) నవ్వుకుంటూ ఉంటారు. వారు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక.. యువతి అమాకపు చూపులు చూస్తూ ఉంటుంది. చివరకు కారు యజమాని అక్కడికి వచ్చి.. ‘‘ఇది ఎలక్ట్రిక్ కారు (Electric car), దీనికి పెట్రోల్‌తో పని ఉండదు’’.. అని చెప్పడంతో యువతి నాలుక్కరుచుకుంటుంది. అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు.. ఇతన్ని ఎలా కాపాడాలో మీరైనా చెప్పగలరా..

Updated Date - 2023-05-07T15:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising