ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఓ చిన్న పాప ఇచ్చిన ఒక్క క్లూ‌తో.. కిడ్నాప్‌కు గురయిన 6 ఏళ్ల బాలుడిని 90 నిమిషాల్లోనే గుర్తించిన పోలీసులు..!

ABN, First Publish Date - 2023-12-04T15:28:10+05:30

సీసీ కెమెరాల్లేవు, ఎక్కడా ఆధారం దొరకలేదు. కానీ 90నిమిషాల్లోనే కిడ్నాప్ అయిన పిల్లాడిని పట్టుకున్నారు. ఇది లియో చేసిన మ్యాజిక్..

ఆ పిల్లాడి వయసు ఆరేళ్లు. ఇంటి ముందు ఆడుకుంటున్నాడు కదా అని తల్లిండ్రులు అనుకున్నారు. కానీ బయటకొచ్చి చూస్తే పిల్లాడు కనిపించలేదు. చుట్టుప్రక్కల అంతా వెతికి చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ఓ చిన్న పాప ఇచ్చిన క్లూ తిరిగి పిల్లాడు దొరికేలా చేసింది. ఇందులో లియో కీలక పాత్ర పోషించింది. సినిమా సంఘటనను తలపించే ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కిడ్నాప్ కు చెందిన పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

ముంబై(Mumbai) నగరంలో ఓ కిడ్నాప్ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైలోని ఓ స్లమ్ ఏరియాలో ఇంటి బయట 6ఏళ్ల పిల్లాడు ఆడుకుంటున్నాడు. అప్పుడే ఓ వ్యక్తి ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి ' నేను మీ మామను.. షికారుకు తీసుకెళ్తాను, చాక్లెట్స్, బిస్కెట్స్ కొనిపెడతాను. దా.. పోదాం' అని పిల్లాడికి ఆశ పెట్టాడు. పాపం పిల్లాడు ఎంతో సంతోషపడ్డాడు. షికారుకు వెళ్తున్నారు కాబట్టి ఉతికిన బట్టలు మార్చుకుని మరీ అతనితో వెళ్లాడు. కానీ ఆ తరువాత ఇంటి నుండి బయటకు వచ్చిన తల్లిదండ్రులకు పిల్లాడు కనిపించలేదు. పిల్లాడు ఏమయ్యాడోనని వారు చుట్టుపక్కలంతా వెతికారు. ఎంతకూ పిల్లాడు కనిపించకపోయే సరికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో పిల్లాడు కిడ్నాప్ కు గురైనట్టు తేలింది. పిల్లాడిని ఎవరెత్తుకెళ్లారో తెలుసుకుందామంటే అది స్లమ్ ఏరియా కావడంతో ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు కాలేదు. దీంతో పోలీసులు డైలమాలో పడ్డారు.

ఇది కూడా చదవండి: Viral Video: నూడుల్స్‌ను తినే అలవాటు ఉందా..? ఒక్కసారి ఈ వీడియోను చూస్తే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారేమో..!



కిడ్నాప్ కు గురైన పిల్లాడిని పట్టుకునే ఉపాయాల కోసం ఆలోచిస్తూ 6ఏళ్ళ పిల్లాడి చెల్లిని కూడా విచారించారు. ఈ క్రమంలో ఆ పిల్లాడు బయటకు వెళ్లేముందు బట్టలు మార్చుకున్నాడని ఆ పిల్లాడి చెల్లి చెప్పింది. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ ను బరిలోకి దింపారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్ కేసులు చేధించడం కోసం ముంబై పోలీసుల చెంత ఉన్న లియో అనే శునకాన్ని(Mumbai police dog leo) పిల్లాడి ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు. పిల్లాడు విప్పేసిన బట్టలను వాసన చూపించి లియోను వదిలారు. లియో పిల్లాడి ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్న ఒక పార్క్ దగ్గర ఆగింది. ఆ పార్క్ లో పిల్లాడు ఒంటరిగా కనిపించాడు. 'మామ వస్తానని చెప్పాడు. ఎక్కడికో వెళ్ళాడు' అంటూ ఆ పిల్లాడు చెప్పుకొచ్చాడు. తమకు తెలియకుండా పిల్లాడిని తీసుకెళ్లేవారు ఎవరూ లేరని పిల్లాడి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. పోలీసులకు భయపడి కిడ్నాపర్ పిల్లాడిని అక్కడ వదిలి వెళ్లాడని అనుకుంటున్నారు. నిందితుడు దొరికేవరకు అతడెవరనేది చెప్పలేమని పోలీసులు తెలిపారు. ఇకపోతే లియో అనే స్నిఫర్ శునకం ఇప్పటికి పలు దోపిడీ, కిడ్నాప్, హత్యకేసులలో నిందితులను పట్టించిందని చెబుతున్నారు. ఈ శునకం పుణ్యమా అని పిల్లాడు కిడ్నాపైన 90నిమిషాలలోనే పిల్లాడు తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. దీంతో లియోకు పోలీసు అధికారుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: స్కూలు నుంచి తిరిగొచ్చాక పిల్లల్ని అడగాల్సిన ప్రశ్నలివీ..!

Updated Date - 2023-12-04T15:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising