Viral Video: ఇంటిలోపల ఓ కుర్రాడి వింత నిర్వాకం.. బైక్ స్టంట్ చేయబోతే ఏం జరిగిందో మీరే చూడండి..
ABN, First Publish Date - 2023-08-20T10:02:22+05:30
కుర్రాళ్లకు బైకులంటే తెగ వ్యామోహం. గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా పర్వాలేదు కానీ బైకు ఉండాలని మాత్రం కోరుకుంటారు.. ఓ కుర్రాడు తన ఖరీదైన బైక్ మీద స్టంట్ చేయబోతే జరిగిందిదీ..
ప్రతి ఒక్కరిలో వేపకాయంత వెర్రి ఉంటుందని అంటుంటారు. కానీ కొందరు కుర్రాళ్ళలో మాత్రం ఈ వెర్రి గుమ్మడికాయంత ఉంటుంది. ఓ కుర్రాడు చేసిన పని దీనికి బలం చేకూరుస్తోంది. బైక్ స్టంట్లు సాధారణంగా రహదారులమీదనో లేక గ్రౌండ్లలోనో చేస్తుంటారు. కానీ ఓ కుర్రాడు మాత్రం ఏకంగా ఇంట్లో బైక్ స్టంట్లు చేయడానికి సిద్దమయ్యాడు. అతను బైక్ ను గాల్లో లేపి డ్రైవ్ చేస్తుండగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు కుర్రాడి మీద తెగ సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
కుర్రాళ్లకు బైకులంటే తెగ వ్యామోహం. గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా పర్వాలేదు కానీ బైకు ఉండాలని మాత్రం కోరుకుంటారు. కొందరు అప్పులు చేసి మరీ బైకు కొంటుంటారు. ఇక మంచి బైకు ఉన్న కుర్రాళ్ళ వెర్రి మామూలుగా ఉండదు. రహదారుల మీద, గ్రౌండ్లలోనూ స్టంట్లు(bike stunts) చేస్తూ సాహసవీరులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే విచిత్రంగా ఓ కుర్రాడు ఇంట్లోనే స్టంట్లు చేయడానికి సిద్దమయ్యాడు(bike stunt in home). వీడియోలో ఓ కుర్రాడు తన ఖరీదైన బైక్ మీద కూర్చుని ఇంట్లో స్టంట్లు చేస్తూ రీల్స్ తీయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్టే బైక్ స్టార్ట్ చేసి ముందు చక్రాన్ని గాల్లో లేపాడు. ఒక కాలు నేలమీద ఉంచి, మరొక కాలు బైక్ మీద ఉంచి మెల్లిగా బైక్ ను ముందుకు నడుపుతున్నాడు. కానీ పైకి లేచిన బైక్ ముందు చక్రం గదిలో ఒక పక్కగా ఉన్న టీవీని తాకింది. దీంతో టివి కింద పడి అది కాస్తా ముక్కలైంది. అంతే కాకుండా దాన్ని కింద పడేసిన కంగారులో కుర్రాడు బ్యాలెన్స్ తప్పాడు. అతను బైక్ తో పాటు కింద పడ్డాడు. ఇంట్లో స్టంట్ చేయడం వల్ల అతను భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
Hair vs Oil: జుట్టుకు నూనె రాసుకునే అలవాటు అస్సలు లేదా..? అయితే ఈ వార్తను తప్పక చదవాల్సిందే..!
ఈ వీడియోను diago_grau062 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పంచులు, సెటైర్లు వేస్తున్నారు. 'అతను గదిని బైక్ తో శుభ్రం చేస్తున్నట్టున్నాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇలాంటి వ్యక్తులకు ఇలా జరగడం నాకు సంతోషంగా ఉంటుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'టీవీ ఎలాగైనా పడిపోవాలని రాసిపెట్టుంది. అందుకే ఇలా పడిపోయింది' అని ఇంకొకరు అన్నారు.
Weight Loss: కష్టపడకూడదు.. కానీ బరువు మాత్రం తగ్గిపోవాలంటే.. ఈ 5 ట్రిక్స్‌ను పాటిస్తే సరి..!
Updated Date - 2023-08-20T10:02:22+05:30 IST