Viral Video: చిన్న పామే కదా అని తోకపట్టుకుని గదిలోంచి లాగబోయాడు.. మరుక్షణంలోనే జరిగిన సీన్‌తో పరుగో పరుగు..!
ABN, First Publish Date - 2023-11-13T12:11:21+05:30
గదిలో నుండి పాము తోక కనిపిస్తోంటే అదేదో పిల్లపాము కదా అని అనుకుని తోక పట్టి లాగాడు. కానీ ఆ తరువాత సీన్ చూస్తే..
పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. విషపూరితమైనవా కాదా అనే బేధం లేకుండా పాము పేరు చెప్పినా, వాటిని చూసినా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తే వారు ఉన్నారు. కొందరు మాత్రం పాములను చాలా ధైర్యంతో పట్టుకుంటారు. ఓ గదిలో పాము తిరుగుతోందని సమాచారం అందితే పాములు పట్టే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. గదిలో నుండి పాము తోక కనిపిస్తోంటే అదేదో పిల్లపాము కదా అని అనుకున్నాడు. కానీ పాము తోక పట్టి లాగిన మరుక్షణం జరిగిన సీన్ చూస్తే గుండెలు దడదడలాడతాయి. ఎంతో ధైర్యగా పామును పట్టుకోవడానకి వచ్చిన అతనే అక్కడినుండి పరుగందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పాముల్ని(Snakes) చూసి భయంతో పారిపోయేవారు కొందరైతే పాముల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాటిని పట్టుకునేవారు మరికొందరు. ఇలాంటివారికి ధైర్యం ఎక్కువేనని చెప్పవచ్చు. పాములు పట్టే ఓ వ్యక్తికి(Snake catcher) ఓ ఇంట్లో పాము దూరిందని తెలియడంతో హుటాహుటిన దాన్ని పట్టాలని వెళ్లాడు. వాకిట్లోనే పాము తోక కనిపించడంతో కర్ర సహాయంతో దాన్ని బయటకు లాగాడు. అనంతరం పాము తోకను చేత్తో పట్టుకుని పామును బయటకు లాగడానికి ప్రయత్నించాడు. అతను అలా లాగడానికి ప్రయత్నిస్తుండదానే ఉన్నట్టుండి బుల్లెట్ వేగంతో కింగ్ కోబ్రా(giant king cobra) బయటకు దూసుకువచ్చింది. అది పడగ ఎత్తి సుమారు మనిషి నడుము నిలువెత్తు పైకి లేచి కోపంతో బుసలు కొడుతోంది. దాన్ని చూడగానే పాములు పట్టే వ్యక్తి ఒక్కసారిగా వెనక్కు వెళ్లాడు. కింగ్ కోబ్రా ఉగ్రరూపం చూసి అతని ధైర్యం కూడా నీరుగారిపోయిందేమో ఆ తరువాత అతను అక్కడ కనిపించలేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ కింగ్ కోబ్రా ఎంట్రీ మాత్రం ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఇది కూడా చదవండి: Dry Fruits: డయాబెటిస్ ఉందా..? ఈ 8 డ్రైఫ్రూట్స్ ఎంత హెల్ప్ చేస్తాయంటే..!
ఈ వీడియోను insta_dada_n.s అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. 'ఇది చాలా భయంకరంగా ఉంది' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'ఆ పాము కోపం రాత్రిపూట కలలో వచ్చి భయపెడుతుంది' అని మరొకరు అన్నారు. 'స్నేక్ క్యాచర్ ధైర్యం పాము ఎంట్రీతో నీరుగారిపోయింది' అని ఇంకొకరు అన్నారు. చాలామంది ఈ పామును చూసి చాలా ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Eggs: కోడిగుడ్డు పెంకు రంగుల్లో ఎందుకింత తేడా..? ఒక్కొక్కటీ ఒక్కో రంగులో ఎందుకు ఉంటాయంటే..!
Updated Date - 2023-11-13T12:11:22+05:30 IST