Viral Video: ఓరి నాయనో.. ఈ అమ్మాయికి ఎంత ధైర్యం.. రెండు పాముల తొకల్ని పట్టుకుని.. వాటితో చెడుగుడు ఆడేసుకుందిగా..!
ABN, First Publish Date - 2023-04-20T15:52:44+05:30
బల్లులను, బొద్దింకలను చూసి బెదిరిపోయే అమ్మాయిలు ఉంటారు. అలాంటిది ఓ అమ్మాయి ఏకంగా పాముల్ని ఒట్టి చేతులతో పట్టుకుంది, అవి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే
పామంటే భయపడని వారు చాలా తక్కువ. ఆ వైపు పాము వెళ్లింది అని ఎవరైనా అంటే ఇక అటువైపు వెళ్ళేవారు బహుశా తక్కువే.. మరీ ముఖ్యంగా బల్లులను, బొద్దింకలను చూసి బెదిరిపోయే అమ్మాయిలు ఉంటారు. అలాంటిది ఓ అమ్మాయి ఏకంగా పాముల్ని ఒట్టి చేతులతో పట్టుకుంది, అవి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే కిందా.. మీదా పడి ఓ రేంజ్ లో వాటితో చెడుగుడు అడేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'ఓ.. అక్కా.. అవి పాములనుకున్నా లేక చేదబావి తాళ్ళు అనుకున్నావా?' అని చమత్కారం చేస్తున్నారు. చూస్తుంటేనే చెమటలు పట్టిస్తున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పాములంటే(snakes) భయపడేవాళ్లు చాలామంది ఉన్నారు. అవేమీ చేయకపోయినా వాటిని చూసి అవి ఏమో చేస్తాయని ముందే వాటిని చంపేవాళ్లు చాలామంది ఉన్నారు. ఓ ప్రభుత్వ కార్యాలయం(Government office) ఆవరణలో ఒకవైపుకు చెత్తా చెదారం(Garbage) ఉన్నాయి. అక్కడ ఓ చిన్న బ్రిడ్జ్(bridge) కూడా ఉంది. ఆ ప్రాంతంలో రెండు పెద్ద పాములు (two giant snakes) ఒకదానికొకటి పెనవేసుకున్నాయి. అదే సమయంలో అక్కడికి జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ లో ఉన్న అమ్మాయి(బదహలు ైదసాల) వచ్చింది. ఆ పాములను చూసి ఉన్నదున్నట్టు ఒక్కసారిగా వాటిమీదకు దూకింది. పామలు చెల్లాచెదురై అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాయి. ఆయితే ఆమె పాముల తోకలు(snake tails) పట్టుకుంది. ఆ పాములు ఆమె నుండి విడిపించుకోవడానికి చాలా గింజుకున్నాయి. ఒక పాము పక్కనే ఉన్న బ్రిడ్జ్ కిందకు వెళ్లింది. కానీ ఆమె మాత్రం ముందుకు పరిగెత్తి బ్రిడ్జ్ కిందకు చెయ్యి పెట్టి ఆ పామును బయటకు లాగింది. పాములు ఎంత గింజుకుంటున్నా ఆమె వాటిని వదల్లేదు. ఆమె పాములు పడుతుండగా కొద్ది దూరం నుండి ఈ సంఘటనను వీడియో తీశారు.
Yellow Teeth: దంతాలు పచ్చగా ఉన్నాయా..? ఎంత ట్రై చేసినా తెల్లగా మారడం లేదా..? ఈ టిప్స్ పాటించండి చాలు..!
_dekhbhai_ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'ఓ అక్కా.. అవి పాములు అనుకున్నావా లేక చేదబావి తాళ్లు అనుకున్నావా?' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఆమె అలా చేయడం తప్పు ఆ పాములు రెండు సంభోగంలో ఉన్నాయి వాటిని అలా డిస్టర్బ్ చేయడం చాలా తప్పు' అని అంటున్నారు. 'ఆమె చేతులారా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటోంది' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఏదైమైనా ఇలాంటి పనులు ప్రాణాలకు రిస్క్ ఎవ్వరూ ఇలా చేయకండి అంటున్నారు.
Wife: నేను ఓ అమ్మాయిని ప్రేమించాను.. నువ్వు ఒప్పుకుంటే రెండో పెళ్లి చేసుకుంటా.. భార్య ముందు ఓ భర్త ప్రపోజల్.. ఆమె సరేనంది కానీ..!
Updated Date - 2023-04-20T15:52:44+05:30 IST